ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వైసీపీ వైరస్ కి వ్యాక్సిన్ రాబోతుంది.
Dr. BRA Konaseema I Polavaram: పేద ప్రజల సంక్షేమ ఫలాల్ని పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంంగా రూపకల్పన చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మేలు చేకూరనుందన్నారు. సంక్షేమం అందిస్తున్నామన్న ముసుగులో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి పేదప్రజల నడ్డి విరుస్తున్న అరాచక వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రజలంతా నడుంకట్టాలని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) పిలుపునిచ్చారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో శుక్రవారం సుబ్బరాజు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన పోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతృత్వంలో మంచి పరిపాలన పొందేందుకు అంతా వచ్చే నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. ప్రశాంతంగా ఉండే ముమ్మిడివరం నియోజకవర్గంలో వివాదాలకు కారణంగా నిలుపుతున్న నాయకులను నమ్మవద్దని, అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికోసం పనిచేసే నాయకుడ్ని ఎన్నుకోవాలని కోరారు.
గడచిన అయిదేళ్ల కాలంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అన్నారు. సుబ్బరాజు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజలు ఆయనకు అడుగడుగునా స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Prakash Babu P
Reporter
I Polavaram