శిరోముండనం తీర్పుపై ప్రభుత్వం తక్షణమే క్రాస్ అప్పీల్ వెయ్యాలి: విదసం నేతృత్వంలో కలెక్టరు ను కోరిన బాదితులు


అమలాపురం: శిరోముండనం కేసులో ముద్దాయిలకు ట్రయల్ కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరితూగేలా లేదని, పైగా నేరస్తులే శిక్షను రద్దు చేయాలని హై కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని, వెంటనే ప్రభుత్వము తోట త్రిమూర్తులు అప్పీల్ పై క్రాస్ అప్పీల్ వేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు.

శిరోముండనం బాడితులతో కలిసి ఈ రోజు అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓ వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద వెంకట రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వమే నేరస్తులకు కొమ్ముకాస్తే సామాన్యులకు దిక్కెవరు ఆని పృశ్నించారు. శిరోముండనం కేసులో జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్యే సీటిచ్చి వైసీపీ తన నైజాన్ని చాటుకుందన్నారు.
 
ప్రభుత్వ సహకారం తోనే ఎమ్మెల్సీ త్రిమూర్తులు హై కోర్టులో అప్పేల్ కు వెళ్లారన్నారు. అధికార యంత్రాంగం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కి పాల్పడితే చట్ట ప్రకారం తీవ్రంగా పరిగణిస్తుందని, ఎమ్మెల్యే హోదాలోనే తోట త్రిమూర్తులు అట్రాసిటీ నేరానికి పాల్పడo మరింత తీవ్రంగా శిక్షలు ఉండాలని, కానీ ట్రైల్ కోర్టు కేవలం 18 నెలలు సాధారణ శిక్ష విధించినందున ట్రైల్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం క్రాస్ అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు అమలాపురంలో జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ లకు వినతి అందజేసినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విదసం ఐక్య వేదిక సహాయ కన్వేనర్ బల్ల కుమార్, కే రాము, వెంకటాయపాలెం దళిత ఐక్య వేదిక వి రామక్రిష్ణ, భాదితులు కే చిన రాజు, సీహెచ్ పట్టాభి రామయ్య, హెచ్ ఆర్ ఎఫ్ నాయకులు రాజేశ్, ఇక్బాల్, పీ డి ఎస్ యు నుండి రేవు తిరుపతి రావు, జే సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.