Hyderabad: హైదరాబాద్ లో తాజాగా రేవ్ పార్టీ కలకలం రేపింది. సిటీ నడిబొడ్డున అన్నట్లుగా మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో జరుగుతున్న రేవ్ పర్టీని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఇటీవల కాలంలో బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా రేవ్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక డ్రగ్స్ రహిత ప్రాంతంగా హైదరాబాద్ ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా మాదాపూర్ లో ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు.
ఈ సమయంలో పట్టుబడ్డవారి నుంచి 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ., విదేశీ మద్యంతో పాటు పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. వివరాళ్లోకి వెళ్తే... మాదాపూర్ లోని సైబర్ టవర్స్ సమీపంలో ఓ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకున్న కొంతమంది బర్త్ డే పార్టీ అని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నారంట. బేగంపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్ డేను పురస్కరించుకుని రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారంరని చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో 14 మంది యువతులు, 6గురు యువకులు పాల్గొన్నారు.
ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, డెంటల్, ఇంజినీరింగ్ విద్యార్థిని, గృహిణి, సేల్స్ విభాగంలో పనిచేసే యువతి ఉన్నారని అంటున్నారు. వీరి నుంచి మొత్తం రూ.1.25 లక్షల విలువచేసే డ్రగ్స్, మద్యంతో పాటు ఇన్నోవా క్రిస్టా కారును స్వాధీనం చేయడం జరిగిందని చెబుతున్నారు.
ఈ రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు! ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరికైనా తమ చుట్టుపక్కల కానీ, ఎక్కడైనా కానీ రేవ్ పార్టీలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.