కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వినతి
కర్నూలు(న్యూసిటీ): కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథక సంక్షేమ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బీఎస్ ఎనఎల్-డీఓటీ పెన్షనర్స్ అసోసియేషన సర్కిల్ అధ్యక్షుడు యాకోబు కోరా రు. ఈ మేరకు శుక్రవారం పంచలింగాలలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజే శారు.
ఈ సందర్భంగా యాకోబు మాట్లాడుతూ ఏపీకి సంబంధించి అడిష నల్ డైరెక్టర్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి సీజీహెచఎస్ అధికారులను, సిబ్బందిని నియమించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత ప్రకాష్ నడ్డాతో చర్చించాలన్నారు. 1.1.2017 నుంచి 15 శాతం ఫిట్‌మెంట్‌తో వేజ్ రివిజనతో సంబంధం లేకుండా డీలింగ్ చేసి పెన్షన రివిజన వీలైనంత త్వరగా చేయించాలన్నారు.
ఎంపీని కలిసిని వారిలో జిల్లా కార్యదర్శి ఎల్. విజయభాస్కర్, సర్కిల్ సెక్రటరీ మహేశ్వరరావు, ఎస్. ఖాజాముద్దీన, కోశాధికారి ఎస్. షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.