కాలిపోయిన చర్చిని సందర్శించిన క్రైస్తవ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు ఫాదర్ బాలస్వామి రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మెడిద జాన్సన్


Dr. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం: వద్దిపర్రు గ్రామంలో కెనాల్ రోడ్లు అనుకుని ఉన్న బైబిల్ మిషన్ చర్చి 12 ఏళ్ల నుంచి దాసరి మోషే అనే పాస్టర్ సేవను కొనసాగిస్తున్నారు. ఆ చర్చి ఫిబ్రవరి 18 తారీఖున తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చర్చిని కాల్చి వేసిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ సంఘటనతో ఆత్రేయపురం మండలం వద్దిపర్రు ప్రజలలో తీవ్ర చర్చాంశంగా మారింది.

ఈ సంఘటనను ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జిల్లా యు.పీ.ఎఫ్ కమిటీ సహకారంతో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అమలాపురం మన్నా చర్చిలో మెగా సేవకుల మీటింగు సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన ఫాదర్ బాలస్వామి మీటింగ్ అనంతరం ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో కాల్చివేసిన బైబిల్ మిషన్ చర్చిని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ మేడిది జాన్సన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ యుపీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎర్నస్ట్ తాతపూడి, జిల్లా సెక్రటరీ ఎం యెహోషువ సందర్శించి చర్చి కాల్చేయబడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫాదర్ బాలస్వామి మాట్లాడుతూ చర్చి కల్చేసిన దుండగులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని వారన్నారు. ధైర్యంగా ఉండాలని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫోన్ చేసి ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధిత పాస్టర్ మోషే కుటుంబాన్ని మరియు సంఘ విశ్వాసులను ఓదార్చారు.‌ 

ఈ కార్యక్రమంలో కొత్తపేట జేఏసీ అధ్యక్షులు రాజు, చైర్మన్ రాజు, జిల్లా జాయింట్ ట్రెజరీ ప్రకాష్, మండల ప్రెసిడెంట్ ఏసుదాస్, ఆత్రేయపురం పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, యుపిఎఫ్ కమిటీ నాయకులు ఆనందరావు, నోబుల్ రాయ్, యడ్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now