ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. జూలై సగం పూర్తయినా రికార్డు ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఏపీ లోని కోస్తా జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. కాగా, బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మొదలైన వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వేడి నుంచి ఉపశమనం దొరికింది. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నా యి. ఇవి శుక్రవారం నుంచి 23వ తేదీ వరకూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతా రణ శాఖ వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్‌లో కొనసాగు ది. దీని నుంచి విస్తరించిన రుతు పవనద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వర ఉంది. ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించింది. వీటికి ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. గురువారం రాత్రికి అల్లూరి, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం
ఈ రోజు (శుక్రవారం)ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని నైరుతి బంగాళా తంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నది. ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ మేఘాలు కోస్తా, రాయలసీమపైకి వీయనున్నాయి. ఇంకా అరేబియా సముద్రంలో బలపడిన రుతుపవన మేఘాలు దక్షిణ భారతం మీదుగా రాష్ట్రంపైకి రానున్నాయి. వీటితో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తా ని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23వ తేదీ వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
భారీ వర్షాలు
ఇక, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు రం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల ల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువన రి జిల్లాలో వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో అత్యధికంగా 6.28 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi