రీల్ కాదు రియల్: గ్రహాంతర జీవులు వచ్చేస్తున్నారట! రీల్ కాదు


WORLD NEWS: రీల్ కాదు రియల్ అని చెబుతున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక అంచనాతో మనకు ఏ మాత్రం ఆచూకీ తెలియని గ్రహాంతర వాసులు భూమి మీదకు యుద్ధానికి వస్తున్నట్లుగా చెబుతున్న విశ్లేషణ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని వస్తువు భూమి మీదకు సెకనుకు 60కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకూ అదేమిటి? దాని మీద ఉన్న అంచనాలు ఏమిటి? లాంటి అంశల్ని చూస్తే.. 


10-20 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తు తెలియని అంతరిక్ష వస్తువు ఒకటి భూమిని లక్ష్యంగా చేసుకొని దూసుకొస్తోంది. సెకనుకు 60కి.మీ. వేగంగా వస్తున్న ఈ వస్తువ ఏమిటి? అందుబాటులో ఉన్న అంచనా ప్రకారం చూస్తే..గ్రహాంతరవాసులు అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భూమి మీదకు దాడి చేసే ప్రమాదం పొంచి ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలా అని అదెప్పుడో కాదని.. మరో రెండు నెలల్లో వచ్చే నవంబరుగా చెబుతున్నారు. 

గ్రహాంతర వ్యోమనౌకగా భావిస్తున్న ఈ అంతరిక్ష వస్తువుకు 3ఐ/అట్లాస్ గా పిలుస్తున్నారు. మొదట్లో దీన్ని ఏ11పీఎల్3జెడ్ గా వ్యవహరించేవారు. అయితే.. ఇది గ్రహాంతరవాసుల సాంకేతికతకు సంబంధించిన వస్తువుగా అభివర్ణించిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవీ లోయెబ్.. భూమి మీద దాడి చేసే అవకాశాల్ని ఆయన అంచనాగా చెప్పటంతో అందరి అటెన్షన్ ఇప్పుడు ఆ వస్తువు మీద పడింది. 

గ్రహాంతర వాసి దాడులపై ప్రఖ్యాత వర్సిటీ హార్వర్డ్ కు చెందిన పరిశోధకులు సైతం ఈసారి కొట్టిపారేయటం లేదు. దాడి అంచనాలకు వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. 2017లొనూ అంతరిక్ష వస్తువ ఒకటి భూమి మీదకు దూసుకొచ్చింది. దానికి అప్పట్లో ‘ఒవుమువామువా’ అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడు అనుమానిస్తున్న వస్తువు ఒకవేళ గ్రహాంతర నౌక అయితే.. భూమిని గ్రహాంతరవాసులు లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. 

చిలీలోని రియో హర్టాడో వద్ద ఏర్పాటు చేసిన టెలిస్కోప్ లో దీన్ని గుర్తించారు. గ్రహాంతర వస్తువు ఒకటి భూమి మీదకు దూసుకొచ్చి.. దాడి చేస్తారన్నది కేవలం సిద్ధాంతమే కావటం కొంతమేర రిలీఫ్ కలిగించే అంశంగా చెప్పొచ్చు. నవంబరు చివర్లో ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. సూర్యుడికి ఎంత దగ్గరగా వెళితే.. దాన్ని గుర్తించటం అంత కష్టమవుతుందని చెబుతున్నారు. ఒకవేళ అంచనాలకు తగ్గట్లు దాడి చేస్తే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

అందుకే.. ప్రపంచ దేశాలు ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. ఒకవేళ గ్రహాంతర వాసులకు చెందిన వస్తువే భూమి మీదకు దూసుకొస్తున్న వేళలో.. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైతే అంతర్జాతీయంగా ఈ అంశంపై అధినేతల మధ్య చర్చలు మొదలు కావాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now