ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏపీలో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు ఏపీ ప్రజలను సైతం షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పైన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
రోజాపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన శ్యామల
ఏపీలో టిడిపి నేతలు సభ్యత సంస్కారం మరిచి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రోజా పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. రోజా కోసం రంగంలోకి దిగిన శ్యామల ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.
పవన్ కళ్యాణ్ స్పందిచాలన్న శ్యామల
మహిళా లోకం అసహ్యించుకునేలా గా, సభ్య సమాజం తలదించుకునేలా గా టిడిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. సినిమావాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన అంటూ ప్రశ్నించారు. మీరంతా నెత్తిన ఎక్కించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా అంటూ ప్రశ్నించారు. మహిళల విషయంలో ఎన్నో మాట్లాడే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని శ్యామల డిమాండ్ చేశారు.
సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యాఖ్యలు: పుష్ప శ్రీవాణి ఆగ్రహం
ఇక మరోవైపు పుష్ప శ్రీవాణి కూడా నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యల పైన అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని, దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోజాపై దారుణంగా షాకింగ్ కామెంట్స్ చేసిన గాలి భాను ప్రకాష్
2000 రూపాయలు ఇస్తే రోజా ఏ పనైనా చేస్తది అని మార్కెట్లో ఆ మాట ఉందని వాళ్ళు వ్యాఖ్యలు చేశారని, రోజా నేడు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించిందని అంటున్నారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. రోజా వ్యాంప్ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ. ఈ పిచ్చి దానితో వాళ్ల పార్టీ నేతలకు పిచ్చెక్కిందా? ఆయన వల్ల ఈమెకి పిచ్చి ఎక్కిందో తెలియడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళను అని కూడా చూడకుండా ఇంత నీచంగా మాట్లాడిన నగరి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi