బాలింత మృతిపై టీ నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

ఆసుపత్రి వద్ద బైఠాయించిన బంధుమిత్రులు

విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి 
విచారణ అధికారిగా జిల్లా వైద్యాధికారి నాగేశ్వరరావు 
భర్త రాము ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టీ నర్సాపురం పోలీసులు 
ముందస్తు చర్యలో భాగంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు 

టి నర్సాపురం: మండల పరిధిలోని బండివారిగూడెం శివారు ప్రకాష్ నగర్ కు చెందిన గిరిజన వివాహిత మహిళ వగ్గెల అలివేలు మంగ(23) మృతిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బంధుమిత్రులు ఆందోళన చేశారు.

వైద్యల నిర్లక్ష్యం వలన గిరిజన బాలింత మృతి చెందిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కొద్దిసేపు బైఠాయించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించి జిల్లా వైద్యాధికారి నాగేశ్వరరావుని విచారణకు ఆదేశించడంతో హుటాహుటిన ఆయన ఏలూరు,,,,   నుండి బయలుదేరి టీ నర్సాపురం చేరుకుని విచారణ చేపట్టారు. భర్త రాము అత్త లక్ష్మి కథనం ప్రకారం అలివేలు మంగ గత 11 రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం సమయంలో సిజేరియన్ జరిగిందని తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని మంగళవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో బిడ్డకు పాలిచ్చే సమయంలో పక్కకు పడిపోయిందని, స్పృహ కోల్పోయిందన్న విషయాన్ని గమనించి వెంటనే ఆటోలో టీ నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నామని విధి నిర్వహణలో ఉన్న నర్సు మంగ, అలివేలు ను పరీక్షించి ప్రాథమిక చికిత్స చేసింది. 

ఎంత సేపు చూసినా వైద్యులు రాలేదని భయంతో ఆందోళన చెంది  108కు ఫోన్ చేశామని అలివేలును అంబులెన్స్ లో చింతలపూడి తరలించామని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అలివేలు చనిపోయి చాలాసేపు అయిందని ధ్రువీకరించారని తెలిపారు. దినితోమరలా ప్రైవేట్ అంబులెన్స్ లో మృతు రాలిని టీ నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి తమ బంధువుల సహకారంతో ఆసుపత్రి  ఆవరణలో ఆందోళన చేపట్టామన్నారు. టీ నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చిన సమయంలోనే అలివేలు చనిపోయి ఉంటే ఆ విషయాన్ని అప్పుడే తమకు తెలియజేస్తే భౌతికకాయాన్ని తిరిగి తమ ఇంటికి తీసుకుని వెళ్లే వారిమని సినిమాలో లాగా శవానికి ప్రాథమిక చికిత్స ఎలా చేస్తారని రాము ప్రశ్నించాడు. వైద్యురాలు రావటంతో జాప్యం జరిగిందని ఆరోపించాడు. వైద్యరాలు నిర్లక్ష్యంమే తన భార్యను కోల్పోయినని రోదిస్తూ తెలిపారు. దినికి తోడు మెరుగైన వైద్యానికి ఎటు వెళ్లాలన్నా రోడ్లు గుంతల మాయం కావడం వర్షం కారణంగా ఎటు వెళ్ళాలో  తేల్చుకోలేక మానసిక క్షోభ అనుభవించామని కన్నీటి పర్యంతం అయ్యాడు.

గిరిజన బాలింత అలివేలు

కారణం ఏదైనా తన భార్య మృతితో తన బిడ్డతోపాటు తను అనాధ అయ్యానని తన భార్య పండంటి బిడ్డకు జన్మనిస్తే అందుకు తలనీలాలు కూడా సమర్పిస్తానని ఆ దేవునికి కూడా మొక్కుకున్నానని భగవంతుడు తమ దంపతుల పట్ల చిన్నచూపు చూశాడని  కన్నీరు మున్నీరయ్యాడు. మంగతాయారు మృతి సమాచారం తెలుసుకున్న బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స కేంద్రానికి చేరుకుని బైఠాయించడంతో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా టీ నర్సాపురం పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలివేలు మృతి సంఘటనపై భర్త రాము లిఖితపూర్వక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కుటుంబ సభ్యులతో చర్చించి అలివేలు భౌతికకాయాన్ని శవ పరీక్ష అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. జిల్లా వైద్యాధికారి నాగేశ్వరరావు మృతురాలు కుటుంబ సభ్యులతో  పి హెచ్ సి సెంటర్ వైద్యులు కల్పనా రాణితో సిబ్బందితో విచారణ జరిపారు. నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తామని తెలిపారు. అలివేలు మృతి సంఘటన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద కార్యకర్తలు అలివేలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాతృమూర్తి పొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు తల్లి ఆకస్మిక మృతితో  అనాధ అయిన దృశ్యాన్ని చూసిన పలువురు కంట కన్నీరు పెట్టారు.

విచారణ అధికారి జిల్లా వైద్యాధికారి నాగేశ్వరరావు

ఈ సందర్భంగా టీ నర్సాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ గిరిజన బాలింత అలివేలు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యుల నిర్లక్ష్యం వలన మరొక వైద్యశాలకు వెళ్ళాలంటే రోడ్లు నరకం ప్రాయంగా ఉండటంతో రోగులు, ప్రయాణికుల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఇబ్బందులను గుర్తించి నరక ప్రాయంగా మారిన చింతలపూడి టి నర్సాపురం రోడ్డు మరియు మక్కినవారిగూడెం రోడ్డు బాగు చేయాలని చింతలపూడి మరియు పోలవరం శాసనసభ్యులు స్పందించాలని మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు.

స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
మృతురాలి బంధువులు ఆమె భౌతిక కాయంతో టి. నర్సాపురం పిహెచ్ సి దగ్గర ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తక్షణం స్పందించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడారు. సంఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 

...