వన్నెతెచ్చిన ఘనత నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి
Dr. BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆ పదవికి వన్నెతెచ్చిన ఘనత నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల జనసేన పార్టీ నాయకుడు, చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. ఆలమూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఒక్కరే సీఎం, ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని, ఉమ్మడి కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు.
తెలుగుదేశం నాయకులు, వైసిపి వారి మాయ మాటలలో పడకుండా, జనసేన, బిజెపితో మరింత ఐకమత్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వారు ప్రజా సేవలో నీతి నిజాయితీగా ముందుకు సాగుతూ ఉన్నారని, ఎప్పుడూ ఎక్కడ అవినీతికి పాల్పడని, గొప్ప నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సేవే, తన ధ్యేయమని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి కోసం రైతుల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం, జనసేన పార్టీని, దేశంలోనే ఒక గొప్ప పార్టీగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న, మా నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని, మేము గర్వంగా ఒక జన సైనికుడిగా చెప్పగలను అని అన్నారు.
గత వైసిపి ప్రభుత్వం లో నలుగురైదురు డిప్యూటీ సీఎంలుగా చేసినా, రాష్ట్ర ప్రజలకు ఎవరు ఏనాడు వారు ప్రజలకు గుర్తు లేరని, డిప్యూటీ సీఎం పదవికి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే వన్నె తెచ్చారని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుండేలా ఆంధ్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను పెంచి, దేశ ప్రజలకు గుర్తుండేలా, ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి వన్నెతెచ్చిన, గొప్ప నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. మన దేశ రాజకీయాలలో ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో, హోం శాఖ కేంద్ర మంత్రి అమిత్ షా తర్వాత స్థానంలో, భారత దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.
అంతటి మహోన్నతమైన వ్యక్తికి, మరి ఎవరు సాటి రారని, డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చేది ఒక్కరే ఉండాలని, అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. భవిష్యత్తులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఉన్నామని, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో, జనసేన పార్టీకి తిరుగులేదని, కొత్తపేట నియోజకవర్గo జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం ఎంతో పటిష్టమైన స్థితిలో నాలుగు మండలాల్లోనూ ఉన్నదని తెలిపారు. బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడం మేము ఎంతో గర్వపడుతూ ఉన్నామని, రేపటి ఎమ్మెల్యేగా బండారు శ్రీనివాస్ ని చూడాలని జనసేన సైనికులు కోరుకుంటున్నారని గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు.