ప్రభుత్వం తక్షణమే కుల గణన చేపట్టాలి!: -యాట్ల నాగేశ్వరావు


ద్రాక్షారామం: ప్రభుత్వం కులగణన తక్షణమే చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మైనారిటీ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రామచంద్రపురం గ్రామీణ మండలం ద్రాక్షారామలో సోమవారం ఆయన స్వగృహంలోని నివాసం నందు మాట్లాడుతూ విద్య, ఉద్యోగం, రాజకీయ, సంక్షేమ రంగాల్లో ఏ కులానికి చెందాల్సిన వాటా ఆ కులానికి కచ్చితంగా దక్కాలంటే కులగణన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. 

కావున ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రం కులగణన కార్యక్రమాన్ని చేపట్టిందని యాట్ల తెలిపారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లోనూ కులగణన అనేది తప్పనిసరిగా చేపట్టాలని ఈ మేరకు యాట్ల నాగేశ్వరరావు కోరారు. భారత రాజ్యంగంలో 246 ఆర్టికల్ ప్రకారం ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన నిర్వహించాల్సి ఉందన్నారు. కులగణనను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకానైనా రూపొందించి అమలు చేస్తారన్నారని ఆయన గుర్తు చేశారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం తక్షణం కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన చేపడితే నియోజకవర్గంలో ఎన్ని రకాల బీసీ కులాలు ఉన్నాయనేది తేటతెల్లమవుతుందని ఆయన అన్నారు. కావున ప్రభుత్వం ఎస్సీ, బీసీ కులాల అభ్యున్నతి కోసం తక్షణం కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.