ANDRAPRADESH: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఆర్ధికంగా అభివృద్ది చెందాలని.. ప్రతీ ఇంటి నుంచి ఓ మహిళా పారిశ్రామికవేత్త తయారవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తగిన కార్యాకచరణ రూపొందిస్తామని మాటిచ్చారు. ఇందుకోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వంటి శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు ఇక మహిళల పెట్టుబడుల్లో 45 రాయితీ ఇస్తామని మాటిచ్చారు.ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ప్రసూతి సెలవులతో పాటు అన్నీ ప్రయోజనాలు అందిస్తామన్నారు.
ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని మాటిచ్చారు. మహిళలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలని ఏపీ సీఎం ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపూరంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈకార్యక్రమంలో మహిళలు ఆర్ధికశక్తిగా ఎదగాలని అందరికి సూచించారు.
ప్రతీ మహిళా ఆర్ధికశక్తిగా ఎదగాలి:చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు.ఈసందర్బంగా అక్కడి మహిళలతో ముఖాముఖి అయ్యారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటి నుంచి ఓ మహిళా పారిశ్రామికవేత్త తయారవ్వాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్ధిక తోడ్పాటుకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు. ఏడాదిలో లక్ష మంది ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు తగిన ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు.