జీలకర్రగూడెం గుంటుపల్లి గుహల సమీపంలో జరిగిన హత్య కేసులో సంచలన తీర్పు


ఏలూరు: 2019 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన శిర్ర శ్రీధరణి దవులూరి నవీన్ కలిసి చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం గుంటుపల్లి గుహల ప్రాంతానికి కలిసి వెళ్లారు. ఉదయం వెళ్లిన వీరు మధ్యాహ్నానికి వీరిలో నవీన్ కుమార్ రక్తపు మడుగులో పడి ఉండగా అతనితో పాటు వెళ్లిన ధరణి హత్యకు గురై కనిపించింది. స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీధరణి హత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. 

దీనిపై కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఉన్న నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను కూడా గాయాలతో ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఆరు సంవత్సరాల క్రితం పోలీసులు వినియోగించారు. మృతురాలి సెల్ఫోన్ ఆధారంగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి సమీపంలోని జి కొండూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన పొట్నూరి రాజు అలియాస్ అంకమ్మరావు అనే వ్యక్తిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 

అయితే అతను ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య అదే ప్రాంతానికి చెందిన తుపాకుల గంగయ్య ఇద్దరు కూడా ఈ కేసులో నిందితులుగా పోలీసులు విచారణలో వెళ్లడైంది. వీరిద్దరూ రాజు భార్యకు స్వయాన అన్నలు కావడం విశేషం. బావల సహాయంతోనే కొన్ని నేరాలకు రాజు పాల్పడినట్లు గుర్తించారు. అతని స్నేహితుడైన మైలవరం మండలం ముడిచెర్ల కృష్టారం పంచాయతీకి చెందిన కొమరగిరి నాగరాజు అనే వ్యక్తి ఈ హత్య అనంతరం రాజుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. 

వెంటనే వీరి అందరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు అప్పిగించారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించింది. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు కూడా వెళ్లడయ్యాయి. ఈ రాజు అనే వ్యక్తి షికార్ అంటే జంతువులను వేటాడే వాటిని తిని జీవించేవాడు. అంతే కాకుండా తోటల్లో పనులు చేస్తూ మారుమూల ప్రాంతాలకు జంటలుగా వచ్చేవారిని టార్గెట్ చేసి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న సొమ్ములను అపహరించి ఆపై మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటాడని విచారణలో పోలీసులు గుర్తించారు. 

ఇతని వల్ల దాదాపు 32 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాదితులు ఎవరు ముందుకు వచ్చి ఇతనిపై ఫిర్యాదు చేయకపోవడంతో ఇతను ఇంకా నేరాలు చేస్తూనే రాసాగాడు. చివరికి తడికలపూడి పోలీసులకు చిక్కాడు. ఇతనిపై అప్పట్లో క్రైమ్ నెంబర్ 47/2019, 120 బి, 376a, 376డి, 379, 302, 307 ఐపిసి సెక్షన్లలో కేసు నమోదు చేయడమే కాకుండా హత్యాచారానికి గురైన బాధితురాలు మైనర్ కావడంతో ఇతనిపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఏలూరు జిల్లా పోలీసులు ఈ కేసును చాలెంజ్ గా తీసుకుని నిందితులకు శిక్ష పడే విధంగా సరైన ఆధారాలు సేకరించారు. 

ఈ కేసును అప్పట్లో చింతలపూడి సర్కిల్ గా పనిచేస్తున్న యూజే విల్సన్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమింపబడ్డారు. ఈ కేసు చివరి విచారణ శుక్రవారం ముగిసింది. వాదోపవాదనులు విన్న తర్వాత ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న రాజుకు పది సంవత్సరాల జైలు శిక్ష, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు జీవిత ఖైదీ, పదివేల జరిమానా, హత్య చేసినందుకు జీవిత ఖైదీ, పదివేల జరిమానా, ఆయుధాలు కలిగి ఉన్నందుకుగాను ఐదు సంవత్సరాల జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించారు. ఇక A2, A3, A4 లకు జీవిత ఖైదీ, 10,000 జరిమానా, అత్యాచారానికి సహకరించినందుకు జీవిత ఖైదీ, పదివేల జరిమానా విధించారు.

చనిపోయిన ఆమె యొక్క తల్లి దండ్రులకు 3 లక్షలు పరిహారం ఇచ్చట కొరకు గౌరవ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశారు. అలాగే గాయపడిన పిడబ్ల్యు2 డి.నవీన్ కుమార్‌కు తగిన పరిహారం మంజూరు చేయాలని డిఎల్‌ఎస్‌ఎ ఏలూరుకు లేఖ రాశారు.

ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్ వారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో పోలీస్ అధికారులు కోర్టులో సాక్షులతో వాదోపవాదాలను వినిపించి ముద్దాయిలకు శిక్ష పడుటలో ప్రత్యేక పర్యవేక్షణ చేసారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హాబీబ్ భాష, ఇన్స్పెక్టర్ విల్సన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, డి సి ఆర్ బి ఎస్ ఐ రాజా రెడ్డి, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఏపీపీ డివి రామాంజనేయులు, పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.