జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్



ఏలూరు జిల్లా, ఏలూరు/దెందులూరు/పెద్ద వేగి: మండలంలోని దుగ్గిరాల గ్రామంలో రబి సీజన్లో ఏలూరు జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని, రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు నియోజకవర్గంలోనీ పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. 

గత వైసిపి ప్రభుత్వం హయాంలో రైతులు పండించే ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర లేక ఆర్బికేల ద్వారా సేకరించిన ధాన్యానికి తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియక రైతులు ఆందోళన చెందే వారిని, జగన్ ప్రభుత్వం పోతూ పోతూ రాష్ట్రంలోని రైతులను నిండా ముంచేయాలనే దురుద్దేశంతో ధాన్యాన్ని సేకరించి దాదాపు రూ.864 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. 

అయితే రైతులకు అండగా నిలబడటమే లక్ష్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమీ ప్రభుత్వం జగన్ ఎగ్గొట్టిన రూ.864 కోట్ల రూపాయల బకాయిలను సైతం సత్వరమే మంజూరు చేయించి ఇవ్వడమే కాకుండా, ఈనాడు ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలకే లోపే రైతులకు ధాన్యం బకాయిలు సైతం నేరుగా వాళ్ళ ఎకౌంట్లో జమవడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని దీని ద్వారా మరోసారి రుజువైందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు హబీబ్ భాషా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రైతులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.864 కోట్ల రూపాయల చెల్లింపులో కీలక కీలక పాత్ర దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోషించారని తెలిపారు. తాను ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులుగా వచ్చినప్పుడు రైతులకు ధాన్యం బకాయిలు ఎంత ఉంది అని దెందులూరు ఎమ్మెల్యే ప్రశ్నించగా తాను జిల్లా నివేదిక చెప్పబోయానని, అయితే కేవలం జిల్లా మాత్రమే కాదని, అసలు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఈ విధంగా బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ గణాంకాలు నివేదికలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 864 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు ఉన్నాయని తెలుపగా వెంటనే ఆయనతోపాటు తనను కారులో తీసుకొని వెళ్లి అప్పటి వెళ్లి పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ తో ఈ విషయంపై చర్చించారని, అదేవిధంగా రైతులకు బకాయిలు సత్వరమే విడుదల కావాలనే లక్ష్యంతో మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ తో కూడా ఈ అంశం పై మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చేయడంలో చింతమనేని ప్రభాకర్ ఎంతో కృషి చేశారని ఉపసంచాలకులు హబీబ్ భాషా తెలిపారు. 

రైతుల కోసం ఆరోజు కూటమి ప్రభుత్వం చూపిన ప్రోత్సాహం ప్రభుత్వానికి సైతం ఎంతో మంచి పేరు తెచ్చిందని, రైతుల కోసం ఇంతలా కృషి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు హబీబ్ భాష తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, కమ్మ శివరామ కృష్ణ, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు వై సుబ్బారావు, మండల రెవెన్యూ అధికారి భ్రమరాంబ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు..

రైతుల సంక్షేమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంతో కీలక పాత్ర పోషించారు.‌ రైతుల కోసం రూ.864 కోట్ల రూపాయల ధాన్యం బకాయిల విడుదలలో చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవ ఎంతో గొప్పది. "నేనే, ప్రత్యక్ష సాక్షిని, అందుకే దైవ సాక్షిగా చెప్తున్నా.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని రైతులకు జరిగిన మేలులో తెర వెనుక ఎంతో కృషి చేసి, ప్రచారానికి సైతం దూరంగా ఉన్న నిజమైన రైతు పక్షపాతి మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.." : సభా ముఖంగా ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హాబీబ్ భాషా వెల్లడి