గంటకు 24,150 కి.మీ వేగం... అమెరికా అణు క్షిపణి వీడియో వైరల్!


WORLD NEWS: ఈ పరీక్షపై స్పందించిన అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ బుస్సెరీ... ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సన్నద్ధతకు, శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. By: BCN TV NEWS ఫ్యూచర్ లో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా అత్యంత పవర్ ఫుల్ ఖండాంతర అణు క్షిపణి మినిట్ మ్యాన్-3 ని పరీక్షించింది. 


దీని ప్రత్యేకతలు సంచనలంగా మారాయి. అవును... దేశవ్యాప్తంగా క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ కోసం ట్రంప్ ప్రణాళిక చేస్తున్న సమయంలో.. అమెరికా వైమానిక దళం అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) మినిట్ మ్యాన్-3ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి దీన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 
 
ఈ పరీక్షపై స్పందించిన అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ బుస్సెరీ... ఈ ఐసీబీఎం పరీక్ష అమెరికా సన్నద్ధతకు, శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు, ఈ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇది రెగ్యులర్ ప్రక్రియలో భాగమని స్పష్టం చేశారు. ఈ మినిట్ మ్యాన్-3లో అత్యంత శక్తివంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ ను అమర్చవచ్చు. గత ఏడాది నవంబర్ లో ట్రంప్ విజయానికి ముందు కూడా దీన్ని ఒకసారి పరీక్షించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మినిట్ మ్యాన్-3 ని అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తోంది. 

ఇక ఈ క్షిపణి ప్రత్యేకతల విషయానికొస్తే ఇది గంటకు 15,000 మైళ్లు (24,140 కి.మీ) వేగంతో.. 4,200 మైళ్లు (6,760 కి.మీ) ప్రయాణించింది. చివరికి మార్షల్ ఐల్యాండ్స్ లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్ కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది. ఇలాంటి అమెరికా వద్ద సుమారు 400 వరకూ ఉన్నట్లు చెబుతారు! అంత కచ్చితమైన వేగంతో, అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉండటంతో దీన్ని ప్రపంచంలో ఏ దేశంపై అయినా దాడి చేయగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా చెబుతారు.