ANDRAPRADESH, KADAPA: మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక భారీ ప్రకటన చేశారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతే కాదు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతటితో ఆగకుండా ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. వినడానికి ఇవి బాగానే ఉన్నా ఒక పాత సామెత గుర్తుకు వస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే అందరూ పల్లకీ ఎక్కితే మోసే బోయీలు ఎవరూ అని. అలా అందరూ పారిశ్రామికవేత్తలూ బిజినెస్ మెన్ అయితే ఇక పనిచేసేది ఎవరూ అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.
👉 తాజా వార్తలు:
అది నిజమే కదా అని అంటున్నారు. ఇందులో ఉన్న లాజిక్ ని బాబు ఎందుకు మిస్ అయ్యారు అని కూడా అంటున్నారు. పారిశ్రామికవేత్త కావడం అంత ఈజీ కాదు, అదే సమయంలో ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త పుడితే ఇక అందరూ సంస్థలు స్థాపిస్తే ఆ ఊహ ఎంతో బాగానే ఉన్నా ఆచరణలో చూస్తే పనిచేసేది ఎవరూ అన్నదే అసలైన డౌట్. బాబు మహానాడులో చేసిన ఈ ప్రకటన మీద అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో సైతం దీని మీదనే సెటైర్లు పేలుతున్నాయి. పరిశ్రమ పెట్టడం దానికి కొనసాగించడం చాలా కష్టమైన ప్రక్రియ. బాబు చెప్పినట్లుగా ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక హబ్ లను ఏర్పాటు చేయవచ్చు. అంతవరకూ బాగానే ఉన్నా అది కూడా చాలా పెద్ద వ్యవహారమే అవుతుంది.
అయినా సరే ప్రభుత్వం చేస్తామని అంటోంది కాబట్టి దానిని నమ్మవచ్చు. కొంత తర్కంతో అర్థం కూడా చేసుకోవచ్చు. కానీ అదే ఊపులో బాబు ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అనడం మాత్రం అతిశయోక్తి గానే ఉంది అని అంటున్నారు. నిజానికి క్యాడర్ ని ఉత్సాహపరచడానికి అధినాయకులు చాలానే చెబుతూంటారు. కానీ కేవలం క్యాడర్ మాత్రమే ముఖ్యమంత్రి సందేశాలను వినదు మొత్తం తెలుగు సమాజం వింటుంది. దాంతోనే బాబు తాజా ప్రకటనలు ఆ విధంగా ట్రోల్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇక చూస్తే సోషల్ మీడియా చర్చలలో చూసినా బాబు చేసిన ప్రకటన సాధ్యమా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఏపీలో ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని బాబు అన్నారు. మొదట దానిని భేష్ అనుకునా ప్రపంచంలోనే అలా ఎక్కడ అయినా ఉందా అన్నదే అందరికీ కలుగుతున్న సందేహం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అయితే లేడు అన్నది నిజమని అంటున్నారు. పాశ్చాత్య దేశాలు డెవలపమెంట్ లో అగ్రగామిగా ఉంటాయి. మరి అక్కడ చూసినా ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త లేడు కదా అని నెటిజన్లు అంటున్నారు. ఇక ఏపీ చూస్తే గట్టిగా నిజం చెప్పుకోవాలీ అంటే ఈ రోజుకీ వ్యవసాయిక రాష్ట్రంగానే ఉంది. పారిశ్రామిక వాతావరణం ఉన్న టైర్ వన్ సిటీస్ కూడా ఏపీలో పెద్దగా లేవు.
ఏపీ విభజన గాయాల నుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఇపుడిపుడే ఎదుగుతున్న రాష్ట్రంగా ఉంది. అటువంటి చోట సీఎం నోట ఈ విధమైన స్టేట్మెంట్స్ రావడం అంటే సీరియస్ నెస్ ఈ విషయంలో ఎంత అన్న చర్చ కూడా వస్తోంది. ఇలాంటి వాటి వల్ల ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తాయి తప్ప వేరే విధమైన ప్రయోజనం ఏమి ఉంది అని అంటున్నారు.
ప్రజలు కూడా చాలా తెలివి మీరిన ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ యుగంలో సోషల్ మీడియా కాలంలో రొటీన్ గా ఇచ్చే హామీల మాదిరిగా ఈ తరహా స్టేట్మెంట్స్ ఇవ్వడం బాబు వంటి అనుభవం కలిగిన నాయకుడికి అవసరమా అన్న చర్చ వస్తోంది. ప్రజలకు ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అవసరం లేదని తమ జిల్లాలలో పరిశ్రమలు వచ్చినా తమ కుటుంబాలకు ఉపాధి దొరుకుంతుందని అంటున్నారు. అపుడు వారే బాబుని చిరకాలం గుర్తు పెట్టుకుంటారు అని అంటున్నారు. బాబు కొన్ని సార్లు అతి ఉత్సాహంతో ఇచ్చే ప్రకటనల వల్లనే ఈ తరహా ట్రోల్స్ వస్తున్నాయని కూడా అంటున్నారు.