రోగిపై డాక్టర్ బ్లాక్ మెయిల్ ఆరోపణలు.. తెరపైకి షాకింగ్ విషయాలు!


WORLD NEWS: ఈ నేపథ్యంలో అతడిపై ప్రాక్టీస్ చేయకుండా మూడేళ్లు నిషేధం విధించబడింది. ఈ సమయంలో బాలసింఘం ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. By:  BCN TV NEWS ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక మహిళా రోగిని ఆమె లైంగిక చరిత్ర గురించి అడగడం, అసభ్యంగా ప్రశ్నించడంతో పాటు అనుచితంగా తాకినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత సంతతికి చెందిన వైద్యుడు మోహన్ దాస్ బాలసింఘం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రాక్టీస్ చేయకుండా మూడేళ్లు నిషేధం విధించబడింది. 


ఈ సమయంలో బాలసింఘం ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. అవును... ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక మహిళా రోగిని అనుచిత ప్రశ్నలు అడిగి, ఆమె అనుమతి లేకుండా శారీరక పరీక్షలు నిర్వహించారంటూ మోహన్ దాస్ బాలసింఘంపై అభియోగాలు మోపబడ్డాయి. దీంతో.. ఆ ఆరోపణలను ఖండించిన బాలసింఘం.. న్యూ సౌత్ వేల్స్ సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఎన్.ఏ.సీ.టీ) లో ఆమెపై 20 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు దావా వేశారు. 

నివేదికల ప్రకారం.. ఒక మహిళ కడుపు నొప్పి, పీరియడ్స్ తప్పినట్లు చెబుతు సిడ్నీలోని మేరీల్యాండ్ లోని ఒక క్లీనిక్ కు వెళ్లింది. అక్కడ ఆమెకు డాక్టర్ మోహన్ దాస్ చికిత్స అందించారు. ఈ సమయంలో.. 'నీకు ఎంతమంది లైంగిక భాగస్వాములు ఉన్నారు'? 'నువ్వు ఫస్ట్ టైమ్ ఎప్పుడు లైంగికంగా యాక్టివ్ గా మారావు?' వంటి ప్రశ్నలు అడిగినట్లు ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో... 'నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు?' 'అందులో నేపాలీలు ఎంతమంది.. ఆస్ట్రేలియన్లు ఎంతమంది?' వంటి అనేక అసభ్యకరమైన ప్రశ్నలు డాక్టర్ తనను అడిగారంటూ ఆ మహిళా ఆరోపించారు. ఇదే సమయంలో తన అనుమతిలేకుండా తనను పలు శారీరక పరీక్షలు చేసినట్లు ఆమె తెలిపారు! 

ఈ నేపథ్యంలో ఆమె రెండు రోజుల తర్వాత హెల్త్ కేర్ ఫిర్యాదుల కమిషన్ (హెచ్.సీ.సీ.సీ.)కి ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఫిర్యాదుపై 2023లో ఎన్.ఏ.సీ.టీ. విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో గత నెలలలో ట్రిబ్యునల్.. బాలసింఘంపై ఉత్తర్వులు విధించింది. అతనిని మూడు ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించిన బాలసింఘం.. ఆ మహిళ తన నుంచి డబ్బు వసూలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేసిందని.. అందుకు పరిహారంగా తనకు 20 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.