ANDRAPRADESH, KARNULLU: దీంతో కర్నూలు రాజకీయాలు టీడీపీలో చర్చగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలు అయింది. By: BCN TV NEWS ఏపీ సీఎం చంద్రబాబుకు కర్నూలు రాజకీయం పెద్ద పరీక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియో జకవర్గాల్లో తమ్ముళ్ల వ్యవహారం చాలా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలోనూ చర్చనీయాంశంగా ఉంది. ఆళ్లగడ్డ, గుంతకల్లు, పా ణ్యం సహా పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఎవరికి నచ్చిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కొందరు సొంత పార్టీ నాయకులపై కత్తులు దూస్తున్నారు.
మరికొందరు.. కూటమిలోనే ఉన్నా.. వైసీపీ నాయకులతో కలిసి హల్చల్ చేస్తున్నారు. పాణ్యంలో ఇదే జరుగుతోందని సీఎం చంద్రబాబు వరకు కూడా విషయం వెళ్లింది. ఇక, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, గుంతకల్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి కూడా.. టీడీపీలో ఎప్పటికప్పు డు చర్చగా మారింది. సొంత పార్టీ నాయకులపైనే వీరు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే.. వారినే కార్నర్ చేస్తూ.. రాజకీయ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.
దీంతో కర్నూలు రాజకీయాలు టీడీపీలో చర్చగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలు అయింది. అ యినప్పటికీ నాయకుల మధ్య ఎక్కడా సఖ్యత లేదు. పైగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువె ళ్లాలన్న చంద్రబాబు మాటను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. కర్నూలు ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరికి.. పలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో బీజేపీలో ఉన్న కారణంగా.. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో అభివృద్ది కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతోంది. ఇక, కుటుంబ వివాదాల కథా చిత్రంతోనే భూమా అఖిల ప్రియ కాలం వెళ్లదీస్తున్నారు. గుమ్మనూరు జయరాం నుంచి పలువురు నాయకుల వరకు సెటిల్ మెంట్లు, సిండికేట్ల వ్యవహారంలో తలమునకలై ఉన్నారని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఎలా చూసుకున్నా.. జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన టీడీపీ ఇప్పుడు పార్టీలో ఏర్పడిన వివాదాల కారణంగా ఎవరికి వారే అన్నట్టుగా ఉంది. మంత్రి ఫరూక్ కూడా ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలన్నది సీనియర్లు చెబుతున్న మాట. మరి ఆయన సరిచేస్తారో లేదో చూడాలి.