రూ.30 కోట్లు ఇచ్చిన ప్రియుడు.. ప్రియురాలు మరొకరితో జంప్!


తాజాగా ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. ఇందులో ప్రైజ్ మనీ కింద కోట్ల రూపాయలు అందాయి. దీంతో.. తన ప్రియురాలితో కలిసి ఇక హ్యాపీగా ఉండొచ్చని భావించాడు. పగటి కలలు కూడా కన్నాడు! కట్ చేస్తే...


WORLD NEWS: తాజాగా ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. ఇందులో ప్రైజ్ మనీ కింద కోట్ల రూపాయలు అందాయి. దీంతో.. తన ప్రియురాలితో కలిసి ఇక హ్యాపీగా ఉండొచ్చని భావించాడు. పగటి కలలు కూడా కన్నాడు! కట్ చేస్తే... ఆ కోట్ల సొమ్ముతో ప్రియురాలు కనిపించకుండా పోయింది. విచిత్రం ఏమిటంటే.. ఆమె ఆ సొమ్ము పట్టుకుని కొత్త ప్రియుడితో పరారైపోయిందంట. 

కెనడాలో లారెన్స్ కాంపెల్ అనే వ్యక్తి 2024లో ఒక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అయితే... అతడికి అదృష్టం ఓ రేంజ్ లో పట్టి.. అందులో రూ.30 కోట్లు గెలుచుకున్నాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ కి పునాది పడింది. ఇందులో భాగంగా.. తన వద్ద సరైన ఐడీ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో తన ప్రియురాలు క్రిస్టల్ ఆన్ మైక్ కే డిటైల్స్ ఇచ్చాడు.

దీంతో సంబంధిత అధికారులు లారెన్స్ ప్రియురాలు మెక్ కే ఖాతాలోకి ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. అప్పటివరకూ అతడితో ఎంతో సన్న్నిహితంగా ఉన్న ఆమె.. ఆ డబ్బు చేతికి అందిన అనంతరం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా... మొత్తం డబ్బు తీసుకుని కొత్త ప్రియుడితో పారారైపోయింది. లారెన్స్ కు ఏమాత్రం దొరక్కుండా జాగ్రత్తపడింది! 

దీంతో.. ఆమె మోసాన్ని గ్రహించిన లారెన్స్ కాంపెల్ కోర్టును ఆశ్రయించాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరాడు. సుమారు ఏడాదికిపైగా ఆమెతో రిలేషన్ లో ఉన్నానని.. జీవితాంతం ఆమెతోనే ఉండాలని నిర్ణయించుకునే ఆ సొమ్ము మొత్తాన్ని ఆమె అకౌంట్ లో వేయించాను.. ఆ తర్వాత కూడా ఆమె కొంతకాలం నాతో సన్నిహితంగానే ఉందని చెబుతున్నాడు.

ఈ క్రమంలో ఒక రోజు హోటల్ కి వెళ్లగా.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు.. డబ్బు చేతికి అందిన తర్వాత నన్ను వదిలి కొత్త ప్రియుడితో వెళ్లిపోయింది అని అతడు వాపోయాడు. ఈ సమయంలో ఆమెను సంప్రదించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతోనే కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు!