రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..


రియల్టర్ గంగాధర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..

ఒక్కొక్కటిగా వెలుగులోకి సంచలన అంశాలు..

ANDRAPRADESH, ANNAMAYYA, MADANAPALLI: రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. మృతుడు గంగాధర్ వడ్డీల పేరుతో మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించడంతోనే హత్య గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈనెల 15న జరిగిన రియల్ ఎస్టేట్ గంగాధర్ హత్య కేసులో భార్య వనితతోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు… అదుపులోకి తీసుకు వీరిలో భార్యతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గంగాధర్ హత్య కేసులో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. 

అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మృతుడు గంగాధర్ గత కొంతకాలంగా కొంత మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్లకు డబ్బులు అప్పుగా ఇచ్చి వారి న్యూడ్ వీడియోలు, ఫోటోలను వారికి తెలియకుండా తన సెల్ ఫోన్ లో తీసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారిని వేధించేవాడని అన్నారు. 

భార్య వనితను సైతం శారీరకంగా, మానసికంగా హింసించేవాడన్నారు. భర్త గంగాధర్ పై కక్ష్య పెంచుకున్న భార్య వనిత మరో ఇద్దరుతో కలసి ఈనెల 15న గంగాధర్ కు తన ఇంట్లోనే నిద్ర మాత్రలు ఇచ్చి గంగాధర్ నిద్రిస్తున్న సమయంలో అతని తల పై బండరాయితో మోదీ హత్య చేసినట్లు ఎస్పీ వివరించారు… ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now