ఏపీలో మరో సర్వే..! డేంజర్ జోన్ లో వీరే..! జిల్లాల వారీగా ఇలా..!


ANDHRAPRADESH:ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల పనితీరు, పథకాల ప్రభావం ఇలా పలు అంశాలపై వారు చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వెలువడగా.. ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ ఐఐటీయన్లు మరో సర్వే ఫలితాలను విడుదల చేశారు

ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 172 నియోజకవర్గాల్లో ఒక్కో సీటులో 425 మంది చొప్నున అభిప్రాయం సేకరించారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి వ్యతిరేకత లేదా కేవలం అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలు సేకరించారు. అలా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లలో టీడీపీ 2 సీట్లలో జనసేన, బీజేపీ ఒక్కో సీటులో ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నాయి. అలాగే టీడీపీ 3 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. విజయనగరంలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో 4 సీట్లలో ప్రజావ్యతిరేకత, ఒక సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన గెలిచిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత ఎదుర్కొంటోంది.

విశాఖలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో ఒక సీటులో వ్యతిరేకత, మరో రెండు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. జనసేన 4 సీట్లలో రెండింటిలో వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి ఎదుర్కొంటోంది. తూర్పుగోదావరిలో టీడీపీ గెల్చిన 13 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత, రెండు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటోంది. జనసేన గెల్చిన 5 సీట్లలో నాలుగు సీట్లలో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. బీజేపీ గెల్చిన ఒక్క సీటులో అసంతృప్తి ఎదుర్కొంటోంది. పశ్చిమ గోదావరిలో టీడీపీ గెల్చిన 9 సీట్లలో మూడింట్లో వ్యతిరేకత, జనసేన గెల్చిన 6 సీట్లలో మూడింట్లో వ్యతిరేకత, మరో రెండింట్లో అసంతృప్తి ఎదుర్కొంటోంది.

కర్నూల్లో టీడీపీ గెల్చిన 11 సీట్లలో ఐదు సీట్లలో వ్యతిరేకత, రెండు సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన ఒక్క సీట్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అనంతపురంలో టీడీపీ గెల్చిన 13 సీట్లలో ఆరు సీట్లలో వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత ఉంది. చివరిగా చిత్తూరులో టీడీపీ గెల్చిన 11 సీట్లలో ఐదు సీట్లలో వ్యతిరేకత, మరో రెండు సీట్లలో అసంతృప్తి ఉంది. జనసేన గెల్చిన ఒక్క సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా రాష్ట్రంలో మొత్తం 72 సీట్లలో కూటమి పార్టీలు వ్యతిరేకత, మరో 26 సీట్లలో అసంతృప్తి ఎదుర్కుంటున్నాయి.

రెడ్ జోన్లో టీడీపీకి చెందిన 54 మంది, జనసేనకు చెందిన 14 మంది, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలున్నారు. అలాగే ఆరెంజ్ జోన్లో టీడీపీకి చెందిన 22 మంది, జనసేనకు చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. గ్రీన్ జోన్లో మాత్రం టీడీపీ నుంచి 59 మంది, జనసేనకు చెందిన నలుగురు, బీజేపీకి చెందిన ముగ్గురు ఉన్నారు. అలాగే వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్ధసారధి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. అసంతృప్తి ఎదుర్కొంటున్న వారిలో అనిత, దుర్గేష్, సవిత ఉన్నారు.

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now