టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ANDHRAPRADESH:టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇది ఉద్దేశ పూర్వకంగా వేధింపుల్లో భాగంగా జరిగిన అరెస్టేనని ఆరోపిస్తూ.. వైసీపీ కార్యకర్తలు వందలా దిగా రహదారులపై నిరసనకు దిగారు. మరోవైపు.. టీడీపీ కార్యకర్తలు కూడా.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఉద్యమిం చారు. దీంతో దెందులూరు నియోజకవర్గంలో ఏక్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది.
పొరుగు ప్రాంతాల నుంచి కూడా పోలీసులు ఇక్కడకు చేరుకున్నారు. దాదాపు నియోజకవర్గంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ `సిద్ధం` పేరుతో సభలను నిర్వహించారు. దెందులూరులో జరిగిన సభలో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారంటూ.. వైసీపీ నాయకులు కొందరు.. జోక్యం చేసుకుని వారిని చితక్కొట్టారు. అప్పట్లో దీనిపైకేసు నమోదు చేసేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. అయితే.. తాజాగా కూటమి సర్కారు రావడంతో నాటి ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై గత నాలుగు రోజులుగా క్షేత్రస్థాయి లో విచారణ చేసిన పోలీసులు .. తాజాగా చర్యలకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు, నాని, తేజలను అరెస్ట్ చేశారు. నాని ప్రస్తుతం వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. తేజ స్థానిక నేతగా చలామణి అవుతున్నారు. వీరితో పాటు మరోయువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తొలుత వీరిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అబ్బ య్య చౌదరి అనుచరులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకుని.. నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. కుట్ర పూరితంగానే నాని, తేజలను అరెస్టు చేశారని ఆరోపించారు.
దీంతో పొరుగు ప్రాంతాల నుంచి కూడా పోలీసులను రప్పించిన ఉన్నతాధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పంగా లాఠీ చార్జి చేశారు. అయినప్పటికీ..వైసీపీకార్యకర్తలు అక్కడే నిరసన తెలిపారు. అయితే.. గట్టి బద్రత నడుమ వైసీపీ నేతలను ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో స్థానిక కోర్టుకు తరలించారు. దీంతో వీరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ..న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. 2019లో తొలిసారి అబ్బయ్య చౌదరి వైసీపీనుంచి విజయం దక్కించుకున్నారు. అనంతరం.. చింతమనేనిపై వరుస కేసులు పెట్టించి.. జైలు-బెయిలు అన్నట్టుగా ఆరు మాసాలకు పైగానే జైల్లో ఉంచారు. దీంతో ఇరు పక్షాల మధ్య అప్పటి నుంచి రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi