నా పీటీఎంకు రాలేదు కానీ..! చంద్రబాబుపై లోకేష్ ఇంట్రస్టింగ్..!


ANDHRAPRADESH:ఏపీలో ప్రభుత్వం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఈ మెగా పీటీఎంలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఓ పాఠశాలలో జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు తన తండ్రి, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో కలిసి విద్యామంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందిన తల్లులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ముఖాముఖి అయ్యారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులకు సీఎం పలు సూచనలిచ్చారు. డిజిటల్ తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు, లోకేష్ మధ్యలో కాసేపు వారితో పాటు బెంచీలపై కూర్చొన్నారు.

అనంతరం విద్యార్దులనుద్దేశించి మాట్లాడిన మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేదని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ మీటింగ్స్ కు తన తండ్రి చంద్రబాబు ఎప్పుడూ రాలేదని, తల్లి భువనేశ్వరి మాత్రమే హాజరయ్యేవారని తెలిపారు. ఇప్పుడు కూడా తన కుమారుడు దేవాన్ష్ పేరెంట్ టీచర్స్ మీట్ కు తాను వెళ్లలేకపోతున్నానని, తన భార్య బ్రాహ్మణి మాత్రమే వెళ్తుందన్నారు. కానీ మీ పేరెంట్ టీచర్స్ మీట్ కు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారని లోకేష్ విద్యార్ధులకు గర్వంగా తెలిపారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now