28 మంది చిన్నారులు సహా 80 మంది మృతి
కళ్ల ముందే వంతెన గల్లంతు.. కెమెరాకు చిక్కిన భయానక దృశ్యాలు
సమ్మర్ క్యాంపు నుంచి 27 మంది బాలికలు గల్లంతు
కొద్ది గంటల్లోనే 10 అంగుళాల భారీ వర్షపాతం
ANDHRAPRADESH:అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో చిన్నారులతో సహా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు అద్దం పడుతూ, కేవలం రెండు నిమిషాల్లో ఓ భారీ వంతెనను నది మింగేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. జులై 4న టెక్సాస్‌లో కొద్ది గంటల వ్యవధిలోనే 10 అంగుళాల భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో మూడో వంతు వార్షిక వర్షపాతంతో ఇది దాదాపు సమానం. దీంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా కెర్ కౌంటీలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ఒక్క కౌంటీలోనే 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు మరణించినట్టు కౌంటీ షెరిఫ్ లారీ లీథా ధృవీకరించారు. గ్వాడలుపే నది ఒడ్డున ఉన్న ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 27 మంది బాలికలు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎన్ఎన్ నివేదికలు తెలిపాయి.
మరోవైపు, కింగ్స్‌ల్యాండ్‌లోని లానో నదిపై ఉన్న ఓ రోడ్డు వంతెనను ఉప్పొంగిన వరద కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా ముంచెత్తిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వంతెనను కబళించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Timelapse shows how the Llano River in Texas flooded within just a few minutes.
— The Austin Conservative 🇺🇸🤘 (@atx_republican) July 5, 2025
Most people don’t realize how fast flash floods happen.
So many lives lost this weekend. It’s been absolutely heartbreaking.
pic.twitter.com/Mxy9s52gs0

Shakir Babji Shaik
Editor | Amaravathi