ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఢిల్లీ బాట పట్టారు. ఇద్దరూ కేంద్ర మంత్రులతో సమా వేశం కానున్నారు. ఇదే సమయంలో ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఇతర శాఖ ల మంత్రులను కలవనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండను న్నారు. బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన అజెండాగా పర్యటన కొనసాగనుంది. ఇక, ఇద్దరు సీఎం లు ఒకే వేదిక మీదకు రావటం ఆసక్తి కరంగా మారుతోంది.
ఢిల్లీలో ఇద్దరు సీఎంలు
తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు (మంగళవారం) ఆయన ఢిల్లీ వెళ్లను న్నారు. 16, 17 తేదీల్లో ఢిల్లీలో ఉండను న్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. 15న సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో.. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. బనకచర్ల పైన వివాదం కొనసాగుతున్న సమయంలో.. ఇద్దరు సీఎంలు కలిసి సమస్య పరిష్కారం దిశగా ప్రతిపాదనలు చేసారు. దీంతో, ఇప్పుడు ఈ అంశం పైన భేటీకి నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
కీలక మంత్రాంగం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతు న్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi