ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: మండపేట నియోజకవర్గం మండపేటలో భారతదేశ చరిత్ర లో ఆదర్శ ఉద్యమ కారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఈ నెల 7న మండపేట లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థకులు బుంగ సంజయ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ లు పిలుపునిచ్చారు.
మండపేట బాబు అండ్ బాబూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7న కృష్ణ మాదిగ పుట్టిన రోజుతో పాటు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు జెండా ఆవిష్కరణ, భారీ ర్యాలీ, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్, మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ఎస్, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కూటమి శ్రేణులు, మాదిగ, మాదిగ అనుబంధ కులాలు, ప్రజలు విశేషంగా తరలి రావాలని వారు కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ సవరపు సతీష్, డోకుబుర్ర రాజబాబు, గాలింకి నాగేశ్వరరావు, మోరంపూడి సూరిబాబు, బొమ్ము గంగాధర్, తొత్తరమూడి ఇజ్రాయిల్, శీలి దశరథ్ రాజు, పాపగంటి చరణ్, కోటా రవి, బంగారు రాజు, బొచ్చ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi