పాచిక పారలేదు!.. సుధాకర్‌ ఇన్‌ఫ్రా ప్లాన్‌


ఉమ్మడి జిల్లాలో ఖనిజ సీనరేజీ డబ్బులు ఎగ్గొట్టాలన్న సుధాకర్‌ ఇన్‌ఫ్రా ప్లాన్‌కు గండి
బాకీ పడ్డ రూ.44 కోట్లు కట్టకుండా తప్పించుకోవాలన్న ప్రయత్నం బెడిసికొట్టిన వైనం
కంపెనీ ఆటలు సాగనివ్వని ప్రభుత్వం : 15 రోజుల్లోగా జమ చేయాల్సిందేనని ఆదేశాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిచిపోయిన సీనరేజీ వసూళ్ల
దందాగత జగన్‌ సర్కారు ఓ కంపెనీకి రూ.20 కోట్లు సీనరేజీ రద్దును సాకుగా చూపిన కంపెనీ
ఆ రద్దు చేసిన సీనరేజీ వల్ల తనకు రాబడి తగ్గిపోయిందంటూ అడ్డగోలు వాదన
తమ కంపెనీ కట్టాల్సిన బాకీలో ఆ డబ్బు మినహాయించాలంటూ తప్పించుకునే యత్నం
ఈలోపు అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో కంగుతిన్న సుధాకర్‌ ఇన్‌ఫ్రా


కాకినాడ: ప్రభుత్వానికి బాకీ పడ్డ ఖనిజ సీనరేజీ డబ్బులు ఎగ్గొట్టాలన్న సుధాకర్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అడ్డగోలు వాదనలతో ప్రభుత్వ ఖజానాకు పంగనామాలు పెట్టాలనుకున్న ప్రణాళికలు పటాపంచలయ్యాయి. బాకీ డబ్బులు రూ.44 కోట్లు కట్టి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అది కూడా 15రోజుల్లోగా ఖజానాకు జమచేయాలని హెచ్చరించింది. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కంపెనీ యథేచ్చగా చెలరేగి పోయింది. ఎక్కడికక్కడ ముక్కుపిండి సీనరేజీ కోట్లలో పిండేసింది. ప్రభుత్వానికి నెలకు రూ.9.70 కోట్లు కట్టి అంతకు పదింతలు రాబట్టేసింది. తీరా అనుహ్యంగా ప్రభుత్వం మారడంతో కంపెనీకి ఝలక్‌ తగిలింది. అడ్డగోలు సీనరేజీ దందా ఆగిపోయింది. ఈ సాకుతో సర్కారు బాకీ ఉన్న బకాయిలు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా వారి పాచిక పారలేదు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గనులశాఖకు చిన్నతరహా ఖనిజాల ద్వారా ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతోంది. గ్రావె ల్‌, నల్లరాతి కొండలు, మట్టి, లేటరైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా భారీగా ప్రభుత్వానికి రాబడి వస్తోంది. అత్యధి కంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం, రాజమ హేంద్రవరం రూరల్‌, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, ము మ్మిడివరం తదితర నియోజకవర్గాల్లో క్వారీ, గ్రావెల్‌, మట్టి తవ్వ కాల ద్వారా ఎక్కువ రాబడి వస్తోంది. అయితే గత వైసీపీ ప్రభు త్వం ఈ రాబడి గనులశాఖకు బదులు మొట్టమొదటిసారిగా కో నసీమ జిల్లాకు చెందిన సుధాకర్‌ ఇన్‌ఫ్రా అనే ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టేసింది. సీనరేజీ వసూలు బాధ్యత నుంచి గనులశాఖను తప్పించి సదరు కంపెనీకి అప్పగించేసింది. 

గనుల శాఖను డమ్మీగా మార్చేసి, సీనరేజీ వసూలు బాధ్యతంతా సుధా కర్‌ ఇన్‌ఫ్రాకు ఇచ్చేసింది. అందులోభాగంగా 2023 ఏప్రిల్‌ నుంచి 2025 ఏప్రిల్‌ వరకు రెండేళ్లపాటు ఈ కంపెనీ ఉమ్మడి జిల్లాలో సీనరేజీ వసూలు చేసుకునేలా అధికారం కట్టబెట్టింది. ఈ రెండే ళ్లకు కలిపి రూ.233 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తేచాలని, అది కూడా భారం అయితే ఇందులో నెలనెలా రూ.9.70కోట్లు చొప్పున 24 వాయిదాల్లో చెల్లించాలని వెసులుబాటు ఇచ్చింది. ఇలా కంపె నీకి పూర్తి సహకారం అందించి ప్రభుత్వ పెద్దలు తెరవెనుక భారీగా పిండేశారు. అటు ప్రభుత్వం అండదడంలు ఉండడంతో సుధాకర్‌ ఇన్‌ఫ్రా ఉమ్మడి ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఉమ్మడి జిల్లాను పిండేసింది. ఎక్కడికక్కడ కొండలు, గుట్టలు, గ్రావెల్‌, క్వారీలు ఉన్న ప్రతిచోటా సొంతంగా మనుషులను నియ మించింది. 

సీసీ కెమెరాలు బిగించి సొంత రసీదులతో చెక్‌పోస్టులు ఏర్పా టుచేసింది. ఎవరు ఏ చిన్న మట్టి,గ్రావెల్‌ తవ్వుకున్నా ముక్కుపిండి సీన రేజీ వసూలుచేసింది. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో వందలాది క్వా రీల నుంచి నల్లరాయి ఇతర జిల్లాలకు ఎగుమతవగా, ఆ లారీల నుంచి ఒక్క రూపాయి కూడా వదలకుండా నెలనెలా కోట్లలో రాబట్టింది. ఈ కం పెనీకి తెరవెనుక వైసీపీ పెద్దల సహకారం ఉండడంతో గనులశాఖ కళ్లు మూసేసుకుంది. సీనరేజీ వసూళ్లలో నిబంధనలు ఉల్లంఘించినా కన్నెత్తి చూడలేదు. దీంతో ప్రభుత్వానికి నెలకు కట్టాల్సిన రూ.9.70 కోట్ల కంటే పదింతల రెట్టింపు ఆదాయం పిండేసింది. ఇలా గత వైసీపీ ప్రభుత్వ హ యాంలో ఈ కంపెనీకి కాసుల పంట పండింది. రెండేళ్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో సింహభాగం తొలి ఆరు నెలల్లోనే లాగేసింది.

సీనరేజి చెల్లించడం ఆపేసి..
అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయన్న సమయంలో సదరు కంపెనీ ప్రభుత్వానికి సీనరేజీ డబ్బులు చెల్లించడం ఆపేసింది. ఇదేంటని గనులశాఖ అడిగితే జగన్‌ ప్రభుత్వం కాకినాడ జిల్లాలో ఓ కంపెనీకి భారీ లబ్ధి చేకూర్చిందని మెలిక పెట్టింది. వాస్తవానికి ఎవరికీ తెలియకుండా గుట్టుగా గత ప్రభుత్వం జిల్లాలో తీరప్రాంతంలో పనులు చేస్తోన్న ఓ ప్రముఖ కంపెనీకి సహకరించింది. రౌతులపూడి నుంచి ఈ కంపెనీ 12 లక్షల మెట్రిక్‌ టన్నుల నల్లరాయి తరలించగా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20 కోట్ల రాయల్టీని రద్దుచేసి మేలు చేకూర్చింది. ఇదం తా రహస్యంగా ఉంచింది. విషయం తెలుసుకున్న సుధాకర్‌ ఇన్‌ఫ్రా గను లశాఖపై ఒత్తిడి తెచ్చింది. ఆ కంపెనీకి రూ.20 కోట్ల రాయల్టీ రద్దు చేయ డం వల్ల తమకు రావలసిన సీనరేజీ ఆదాయం పోయిందని అభ్యంతరం తెలిపింది. 

అందువల్ల తాము నెలనెలా చెల్లించాల్సి ఉన్న బకాయిలకు సర్దుబాటు చేయాలంటూ కొత్తపాట పాడింది. అయితే కంపెనీ వెనుక వైసీపీ నేతలు ఉండడంతో గనులశాఖ మొత్తబడింది. దీంతో తన ఆటలు సాగినట్లేనని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన తన బాకీ కట్టకుండా ఉండొచ్చని లెక్కలేసుకుంది. ఎన్నికలు జరిగినా తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందనే ధీమాతో సదరు కంపెనీ అలా తన బాకీలు కట్టకుండా ఉండిపోయింది. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంపెనీ కంగుతింది. ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా సీనరేజీ వసూలు కాంట్రాక్టు రద్దయి పోయింది. అటు కట్టాల్సిన బాకీలు చెల్లించాలంటూ గనులశాఖ ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. 

కొత్త ప్రభుత్వంలో పైరవీలు చేసి బాకీలు కట్ట కుండా చేయాలని సదరు కంపెనీ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వం నుంచి సదరు కంపెనీకి సహకారం దొరకలేదు. సరికదా మొత్తం సీనరేజీ బాకీలన్నీ కలిపి రూ.44కోట్లు కట్టితీరాలని ఇటీవల గట్టిగా హెచ్చరించింది. 15రోజులలోగా ఖజానాకు డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ముందు బాకీ చెల్లిస్తే తర్వాత రాయల్టీ రద్దులో సుధాకర్‌ ఇన్‌ఫ్రాకు అసలు సీనరేజీ రావలసి ఉందా? లేదా? తేల్చుదామని పేర్కొంది. దీంతో సుధాకర్‌ ఇన్‌ఫ్రా గింజుకుంటోంది.