యువ ఇంజినీర్ల మెంటార్ షిప్ భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలి: సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్

ఏఎస్పీడీ శ్రీ ఎం.ఆర్.ప్రసన్నకుమార్

 
• రాష్ట్ర స్థాయి ఏటిఎల్ మెంటార్‌షిప్ విద్యార్థులకు సత్కార సభ 

విజయవాడ: ఇంజినీరింగ్ విద్యార్థులు అటల్ టింకరింగ్ లాబ్స్ ఉపయోగించుకోవాలని , ప్రయోగాలు నిర్వహించాలని, శాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ ఎం.ఆర్. ప్రసన్నకుమార్ అన్నారు. 

బుధవారం విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్షా ఆంధ్ర ప్రదేశ్ BCDE-APSCHE (Board of Community Development through Education - Andhra Pradesh State Council of Higher Education)-UNICEF, Vigyan Ashram వారి సహకారంతో రాష్ట్ర స్థాయి “టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) పంచుకోవడం, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సత్కార” కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ సమావేశంలో మెంటార్‌షిప్ వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం, ఇంజనీరింగ్ విద్యార్థులు, యువ విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించడం వంటి అంశాలపై అతిథులు ప్రసంగించారు. 
ఈ సందర్భంగా ఎం.ఆర్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ఇంజనీరింగ్ విద్యార్థులు మెంటార్ షిప్ అవకాశం కేవలం అకడమిక్ క్రెడిట్‌గా కాకుండా, యువ విద్యార్థులను సరైన దారిలో నడిపించే బాధ్యతగా చూడాలన్నారు. ఇది భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండేలా కృషి ఉండాలన్నారు. సునీతా విలియమ్స్ ఉదాహరణగా పేర్కొంటూ, “ఆమె తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆమెకు సరైన జ్ఞానం, ప్రిపరేషన్, కఠినమైన అభ్యాసం ఉందని" గుర్తుచేశారు. అదే విధంగా, నేటి విద్యార్థులంతా విద్యను అర్థం చేసుకుని, ఉపయోగించాలి” అని అన్నారు.
డా. ఇలంగోవన్ కరియప్పన్ (అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ఇన్నోవేషన్ సెల్, కేంద్ర మంత్రిత్వశాఖ) వర్చువల్ గా విద్యా ఆవిష్కరణల ప్రోత్సాహంపై మాట్లాడుతూ.. ఇన్నోవేషన్ కౌన్సిల్స్, మేక్ ఏ థాన్ లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, టీచర్ ట్రైనింగ్ వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలు విద్యార్థులకు ఆవిష్కరణల దిశగా మార్గదర్శనం చేస్తున్నాయన్నారు. 

స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో 50,000 స్కూళ్లు, 6 లక్షల మంది విద్యార్థులు పాల్గొని,1 లక్షకు పైగా ఆవిష్కరణలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు కేటాయించామని తెలిపారు. జూలై 29న నేషనల్ ఇన్నోవేషన్ డే సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 31 ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాళ్లతో ToR (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఒప్పందం కుదుర్చకున్నారు. మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లో విశేషంగా పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంటార్లకు సర్టిఫికేట్‌లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జెలాలెం బి టఫెస్సే (యునిసెఫ్ చీఫ్, ప్రొఫెసర్ ఎమ్.ఎల్.ఎస్. దేవ కుమార్(సెక్రటరీ & CEO, BCDE), ప్రతీక్ దేశ్ముఖ్ (ఇన్నోవేషన్ లీడ్, AIM–NITI ఆయోగ్), డాక్టర్ కె. శివాజీ బాబు (పీవీపీ సిద్ధార్థ ఐటీ ప్రిన్సిపాల్), శేషగిరి మధుసూధన్, శిఖా రాణా, కిషోర్ గైక్వాడ్ (మేనేజర్, విగ్యాన్ ఆశ్రమ్), టి. సుదర్శన్ (UNICEF కన్సల్టెంట్) తదితరులు పాల్గొన్నారు.