విజయసాయి రెడ్డికి షాక్.. కుమార్తె నేహా రెడ్డికి 17కోట్ల జరిమానా!


ANDHRPRADESH:మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జరిమానా విధించింది. నేహా రెడ్డికి 17 కోట్ల రూపాయల జరిమానా విధించింది. విశాఖ బీచ్ సమీపంలో కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు తేల్చిన హైకోర్టు ఈ నిర్మాణాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందని నిర్ధారించింది.

విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి షాక్

నిబంధనలను ఉల్లంఘన జరిగినట్టు పేర్కొన్న కోర్టు 1.2 లక్షల చొప్పున, 1455 రోజులకు గాను మొత్తం 17 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పర్యావరణ శాఖ నివేదికల ఆధారంగా హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలు కాటేజీలు, వ్యాపార కార్యకలాపాలపైన కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్రకృతిని పరిరక్షించాలని ఉద్దేశంతో ఈ నిబంధనలను రూపొందించారు.

తవ్విన భూమిని పునరుద్ధరించాలని ఆదేశం

అయితే వాటిని ఉల్లంఘించి నేహా రెడ్డి నిర్మించిన నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని పేర్కొన్నారు. తవ్విన భూమిని పునరుద్ధరించిన పక్షంలో ఈ 17 కోట్ల రూపాయల జరిమానా రెట్టింపు అవుతుందని హైకోర్టు ధర్మాసనం నేహా రెడ్డిని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది. పర్యావరణవేత్తలు కోర్టు తీర్పు పైన హర్షం వ్యక్తం చేస్తుండగా, పలువురు వైసిపి నాయకులపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

పర్యావరణానికి హాని చేసే వారికి హెచ్చరిక

వైసిపి హయాంలో పర్యావరణ విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదని పర్యావరణానికి హాని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక అని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చేయని ప్రతి ఒక్కరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ తీర్పు ద్వారా హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

భీమిలి బీచ్‌రోడ్డులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఇదిలా ఉంటే గతంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కుమార్తెకు సంబంధించిన భీమిలి బీచ్‌రోడ్డులో సముద్రతీరం పక్కన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధలనకు విరుద్దంగా చేపట్టిన అక్రమ కాంక్రీటు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now