అమరావతికి విరాళం..! వైసీపీ మాజీ మంత్రి షాకింగ్ ఆఫర్..!


ANDHRPRADESH:ఏపీ రాజధాని అమరావతికీ, వైసీపీకీ ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. అధికారంలోకి రాకముందు అమరావతి రాజధానిగా అంగీకరించి, అనంతరం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు జగన్ విఫలయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఓవైపు రాజధాని అమరావతి పనుల్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వేళ అదే వైసీపీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబుకు సంచలన ఆఫర్ ఇచ్చారు.

తాజాగా జగన్ నెల్లూరు టూర్ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ను అవినీతి పరుడిగా పేర్కొంటూ టీడీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఇవాళ అనిల్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సీటింగ్ జడ్జితో విచారణ వేసే దమ్ముందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు చెప్పినట్టు వేల కోట్లు నా వద్ద ఉందని నిరూపించండి, నిరూపిస్తే అమరావతికి విరాళంగా నేనే ఇచ్చేస్తానంటూ అనిల్ కుమార్ ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఆస్తుల్లో రూపాయి పెరిగినా విచార సిద్ధమే అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అనిల్ యాదవ్ తెలిపారు. ఈ విషయంపై చంద్రబాబుకి లేఖ రాయడానికి కూడా తాను సిద్ధమే అన్నారు. గత కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, అక్రమ మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం లో తన పేరు ఉందని చెప్పారని, వాంగ్మూలం తీసుకునేప్పుడు అందులో వాస్తవాలు ఏంటో చూడాలన్నారు.

మాజీ మంత్రి కాకాని, తాను కలిసి మైనింగ్ చేశామని వాంగ్మూలంలో రాసుకున్నారని,గతంలో తనకూ, ఆయనకూ మనస్పర్ధలు ఉండేవన్నారు. అలాంటప్పుడు తాము కలిసి ఎలా వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. వచ్చిన ఆదాయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని చెప్పారని, హైదరాబాద్ లో అసలు వారు చెప్పిన లే అవుట్ లు లేనే లేవని అనిల్ తెలిపారు. 2023 లో మైనింగ్ లో డబ్బులు వస్తే.. 2022లో వెంచర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో 4వ తేదీన విచారణకు హాజరవుతానని అనిల్ తెలిపారు. మీరు జైలుకి పంపాలన్నా నేను వెళ్ళడానికి సిద్ధమేనన్నారు. తాను చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నండుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మైనింగ్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నారన్నారు. 400 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టాలని అనుకున్నందుకు 20వేల టన్నులు ఎందుకు ఎగుమతి చేశారని ప్రశ్నించారు. క్వాలిటీ టెస్ట్ కోసం ఒక కంటైనర్ పంపుతారని, ఇలా 20 వేల టన్నులు పంపుతారా అని ప్రశ్నించారు. క్వార్జ్ పై ఈడీ విచారణకు సిద్దమా అని వేమిరెడ్డిని అడిగారు. దీనిపై ఈడీకి లేఖ రాస్తానన్నారు


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now