ముద్రగడకు బారసాల రెడీ... నటుడు ఫృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు!


పిఠాపురంలో పవన్ ఓటమి కన్ ఫాం అని ముద్రగడ బలంగా చెబుతుండటంతో వారు మరింత ఫైర్ అవుతున్నారు. పోలింగ్ తేదీకి మరో పదిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏపీ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పీక్స్ కి చేరుతున్నాయి. ఇక జనసేనలోని పలువురు కాపు నేతలు ప్రధానంగా ముద్రగడ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. 


పిఠాపురంలో పవన్ ఓటమి కన్ ఫాం అని ముద్రగడ బలంగా చెబుతుండటంతో వారు మరింత ఫైర్ అవుతున్నారు. ఇటీవల కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం మాట్లాడిన ముద్రగడ పద్మనాభం... వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం ఖాయమని.. పవన్‌ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన తర్వాత జనసేన నేతలు మరింత వేడెక్కిపోతున్నారని అంటున్నారు. పైగా ముద్రగడ అంత గట్టిగా చెప్పేసరికి సమీకరణలు మారుతున్నాయా అనే చర్చ జనసేనలోనూ మొదలైందని అంటున్నారు! 

ఈ సమయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము యూనివర్శిటీల్లో చదువుకునే రోజుల్లో కిర్లంపూడిలో కాపు నాయ్కుడు ఉన్నాడని తామంతా గొప్పగా భావించేవాళ్లమని, రెండు చేతులూ జోడించి నమస్కరించేవాళ్లమని చెప్పిన పృథ్వీరాజ్... అదంతా డ్రామా అని ఇప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక ముద్రగడ పేరు మార్చుకోవాలంటే.. భీమవరం నుంచి అరటిపళ్ల గెలలు వేసుకుని అందరినీ తీసుకొస్తామని రావాల్సి వస్తుందన్నట్లుగా చెప్పారు! 

కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యానించిన పృథ్వీరాజ్... భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు. కాపు కులం రైలు లాంటిదని.. అందులో నింపడానికి చూడాలి తప్ప తోసేయకూడదని అన్నారు.

ముద్రగడ నీకు సిగ్గుందా.. నీకు రెడ్డికాపు అనే పేరు నేనే పెట్టా.. నీకు బారసాల చేస్తాం.. నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?.. ముద్రగడ నువ్వు కాపు నాయకుడు అనే ముద్ర తీసేయ్. కాపులు నిన్ను అసహ్యించుకుంటున్నారు.. చిన్నపిల్లలు కూడా నిన్ను ఉప్మా ముద్రగడ అంటున్నారు.. అంటూ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.