ముస్లిం క్యాలెండర్ చాంద్రమానం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే చంద్రుడిని చూసిన తర్వాతే బక్రీద్ పండుగ తేదీ ఎప్పుడనేది కచ్చితంగా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో 17వ నెలవంక కనిపించిన తర్వాత ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇలా నెలవంక కనిపించడాన్నిని హజ్ చాంద్ అంటారు. చంద్రుడు కనిపించిన మరుసటి రోజు నుంచే హజ్ మాసం ప్రారంభమవుతుంది. దీంతో జిల్హిజా మాసంలో పదో రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. అంటే ఈ నెల 17వ తేదీన సోమవారం నాడు బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరికీ ఈద్-అల్-అద్హా ప్రధాన పండుగ. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో తమ ప్రియమైన వస్తువులను త్యాగం చేయమని దేవుడు చెప్పినట్లు ప్రవక్త అబ్రహం(ఇబ్రహీం) తన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం(బలి) చేసేందుకు సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులు ఓ మూగ జీవాన్ని బలి ఇవ్వాలని చెబుతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా బలి ఇచ్చిన మూగజీవాలను మూడు భాగాలుగా చేసి.. అందులో ఓ వంతు పేద ప్రజలకు, రెండో వంతు తమ చుట్టాలకు, మూడో వంతు భాగాన్ని తమ కుటుంబం కోసం వాడుకుంటారు. అందుకే బక్రీద్ పండుగ రోజున ముస్లిలందరూ ఖుర్బానీ ఇస్తారు.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘BCN TV’’ దృవీకరించడం లేదు.