టి. నరసాపురంలో ఘనంగా లూయిస్ డాగురే జయంతి వేడుకలు


టి.నరసాపురం/ఏలూరు: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా T. నరసాపురం ZP హైస్కూల్ HM లింగస్వామి పాల్గొని డాగురే గారి విగ్రహానికి పూలమాల వేసి, కెమెరా సృష్టించిన మహానుభావున్ని గుర్తుంచుకొని జయంతి వేడుకలు చేస్తున్న T. నరసాపురం మండల ఫోటో&వీడియో గ్రాఫర్స్ ని అభినందించారు.



మన మధుర స్మృతులను ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ యొక్క నైపుణ్యాలతో, కొత్త టెక్నాలజీలతో బంధించి తరాతరాలు మనలను చూసుకొని ఆనందపరచ్చేలా చేసేవారే ఫోటోగ్రాఫర్స్ అని అన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ లో వృద్ధులకు, పేసెంట్ లకు డాక్టర్ హనుమంతరావు గారిచే వైస్ ప్రెసిడెంట్ మహారాజు, సెక్రటరీ చందు, యూనియన్ సభ్యులు అందరు ఫ్రూట్స్ పంచిపెట్టారు. 

ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ విధంగా సేవచేయ్యడం మంచి ఆలోచన అని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలని ఫోటోగ్రాఫర్ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహారాజు, సెక్రటరీ చందు, లాల్ మహ్మద్, యాసీన్, రవి వర్మ, సునీల్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.