విశాఖపట్నం సిటీ: స్ధానిక 67వ వార్డు సాయిరాం నగర్ లో జోగావానిపాలెం భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్ స్ట్)శాఖ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. శాఖ సభ్యులు కామ్రేడ్ యు వి ఎస్ ఎన్ వర్మ పథకావిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమానికి కే కిరీటం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వ్యక్తులు మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవుల కోసం పని చేసే పార్టీ సీపీఎం పార్టీ అని అన్నారు. సమ సమాజ నిర్మాణానికి పని చేస్తున్న విప్లవ పార్టీ అని తెలిపారు. ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోయి అందరికీ అన్నీ సమనoగా అందాలని పార్టీ పోరాడుతున్నట్లు తెలిపారు.
మన జీవితాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయని, తినే తిండి దగ్గర నుంచి ఉద్యోగం వరకు ప్రతి ఒక్కటీ రాజకీయాల వ్యక్తులే నిర్ణయిస్తున్నారని అన్నారు. అయితే రాజకీయ పార్టీలను నడిపించేది కార్పొరేట్ కంపెనీలా లేదా ప్రజలా అనే దాని పై అవి ప్రజలకు ఎటువంటి సేవ చేస్తాయి అనేది నిర్ణయం అవుతుందని తెలిపారు.
కాబోయే ఓటర్లుగా సమాజ హితం కోరేవారీగా 28 డిసెంబరు ఉదయమ 10 గంటలకు పెందుర్తి కాలేజీ నుంచి జరిగే సీపీఎం మహా సభలను జయప్రదం చేయాలని శాఖ కార్యదర్శి లక్ష్మణస్వామి పాలూరు ప్రజలను పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ కుమార్, కే సంతోషం, ప్రతాప్ కుమార్ సభను ఉద్దేశించి మాట్లాడారు.