కొవ్వాసు విజయ జగదీశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ.


మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పాతపట్టిసీమ గ్రామంలో వేంచేసియున్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు బాటసారులకు విజయ జగదీశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 10 వేలమంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేసినట్లు కొవ్వాసు జగదీశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వాసు జగదీశ్వరి, విజయ నాయక్ జితేంద్ర, మోజీష్, పోతరాజు నరేష్, మణికంఠ, బుజ్జిదొర, అప్పారావు, సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు.