పదో తరగతి ఇంగ్లీషు పరీక్షకు 98.92 శాతం హాజరు


• శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సిబ్బంది, తిరుపతిలో ఒకరు సస్పెన్స్
• రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు డిబార్
• పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు.వి ఐ.ఏఎస్.,

ANDHRA PRADESH: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,20,173 మంది విద్యార్థులకు గానూ 6,13,487 మంది విద్యార్థులు (98.92 శాతం) హాజరు కాగా 6,656 మంది గైర్హాజరయ్యారని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాల ఎ, బి పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించే లక్ష్యంగా సిబ్బంది సహకారంతో మాల్ ప్రాక్టిస్ జరిగింది. 

ఈ నేపథ్యంలో మాల్ ప్రాక్టిసుకు పాల్పడిన 5గురు విద్యార్థులను డిబార్ చేసి, సహకారం చేసిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఒక విద్యార్థిని డిబార్, ఒక ఉపాధ్యాయుణ్ని సస్పెండ్ చేశామని తెలిపారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1673 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., అధికారులను ఆదేశించారు.