నేటితర యువతీ యువకులకు పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడు. - జయింతి వేడుకలలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు



స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు
పుట్టింది: 16 మార్చి 1901, 
పుట్టిన ప్రాంతం: నెల్లూరు జిల్లా 
వృత్తి: స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాటం 
మరణం: 15 డిసెంబర్ 1952 (ఉపవాస దీక్షలో) వారి యొక్క ప్రాణాలను కోల్పోయినట్లు


ఏలూరు జిల్లా, ఏలూరు: పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనముగా నివాళులను అర్పించారు. 

ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన గొప్ప నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు అని కొనియాడారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పిలుపు మేరకు భాగస్వామ్యమైనారు. హరిజన ఉద్ధరణ కోసం సేవ చేశారు. తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన నిరాహార దీక్ష 58 రోజులు కొనసాగింది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. 1953లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిందని పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు.

పొట్టి శ్రీరాములు జీవితం మనకు ధైర్యం, త్యాగం, పట్టుదల ఎలా ఉండాలో నేర్పుతుందని చెప్పారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి మనం గౌరవంగా శ్రద్ధాంజలి ఘటించాలని నేటితర యువతీ యువకులకు ఆదర్శప్రాయుడని కొనియాడినారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి సిసి అబ్దుల్ అలీమ్, ఆర్ ఐ పవన్ కుమార్, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్, ఎస్సై రాజా రెడ్డి, ఆర్ఎస్ఐ భాస్కరరావు, పోలీస్ సిబ్బంది, ప్రధాన కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.