పవిత్ర గోదావరి చెంతన కొరిమిల్లి గ్రామంలో నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ఆవిష్కరణ

 


అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లి గ్రామంలో గౌతమీ నది తీరాన నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం ఎంతో వైభవ పేతంగా జరిగింది. ఈ నెల 9, 10వ, తేదీలలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వేద పండితులుచే యాగాలు, విశేష పూజలు నిర్వహించి, ఈ రోజు ఉదయం స్వామి వారి విగ్రహా ప్రతిష్ట , ధ్వజ స్థంభం ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. 
Download link: install 


ఈ మూడు రోజులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు నినాదాలుతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఎమ్ ఎల్ సి తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావులు విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని, శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. వారి ఇరువురికి ఆలయ కమిటీ వారు అపూర్వ స్వాగతం పలికారు. తాను 1994వ సంవత్సరంలో ఇండిపెండెంట్ ఎమ్ ఎల్ ఏ గెలిచిన నాటికి, నేటికీ కోరుమిల్లి గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్ ఎల్ సి తోట త్రిమూర్తులు అన్నారు. 


గౌతమీ నది తీరాన మొదటిగా వినాయక ఆలయ నిర్మాణంతో ప్రారంభమయి, నేడు పలు ఆలయాలు నిర్మించారని తోట ప్రశంసించారు. రెండు కోట్ల రూపాయలుతో నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం గ్రామస్తుల సహకారం ఎనలేనిదని ఎమ్ ఎల్ సి తోట అన్నారు. ఆలయ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా తాను సంభదిత అధికారులతో మాట్లాడానని తోట తెలిపారు. పూజా కార్యక్రమాలు నిర్వహించే మూడు రోజులు ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించారు. ఆలయానికి ధ్వజ స్తంభం సుంకర బుజ్జి బహూకరించారు. వేలాదిగా గ్రామస్తులు, బందుమిత్రులు తరలి వచ్చి ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.




Download app link: install