తెలంగాణలోని మహిళలకు భారీ శుభవార్త.. ఈ రోజు నుంచే చెక్కుల పంపిణీ


HYDERABAD:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. అలాగే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. తెలంగాణలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని మహిళలకు భారీ శుభవార్త. మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) ఈ రోజు నుంచి వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయనుంది. ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.344 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది.

తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ-2025 ను రూపొందించారు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా నూతన విధానంలో మహిళా శక్తి సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే రుణాలు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. దీంతోపాటు మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.344 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now