నటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య నటించిన లంబసింగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తన జీవితంలో ఎదురైన కొన్ని ఘటన గురించి అభిమానులతో పంచుకుంది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని. లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని.. ఇలా రకరకాల కండిషన్లు పెట్టారు.
అయినప్పటికీ వాటిని తట్టుకుని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని ఈ బ్యూటీ తెలిపింది. రవితేజతో లీడ్ క్యారెక్టర్‌కు దివిని ఎంపిక చేశారట. నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్ చెప్పారట. తీరా చూస్తే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేవారని తెలిపి బాధపడింది. ఈ బాధల్నీ భరించలేక ఇంటికెళ్లి షవర్ పెట్టుకొని నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చానంటూ తెలిపింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి బాధపడింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోల్లో కొత్తగా టాటూ దర్శనం ఇచ్చింది. తన ఎద భాగంలో టాటూ వేయించుకొని దాన్ని చూపించేలా షార్ట్ డ్రెస్సు, జిమ్ డ్రెస్సుల్లో పరువాలు చూపిస్తోంది దివి.ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.