ఏలూరు 24వ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి బడేటి చంటి



ఏలూరు: సైకో సీఎం జగన్‌, వైసిపి నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బీజేపి కూటమి విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్ధి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 24వ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్ళి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

ఈ సందర్బంగా బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదోగతిపాలు చేసిన సీఎం జగన్‌ రాక్షస పాలనకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్ధత కూటమికే ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు టిడిపి కట్టుబడి ఉందని, వారి సంక్షేమానికి టిడిపి హయాంలో అమలు చేసిన అన్ని పథకాలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్‌ యువత భవిష్యత్తును చిధ్రం చేశారని ఆయన ఆరోపించారు. సీఎం తన చేతకానీ తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లుతున్నారని బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పింఛన్ల పంపిణీలో జాప్యానికి ముమ్మాటికి జగన్‌ చేతకానితనమే కారణమని, దీన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 

వాలంటీర్‌ వ్యవస్థ లేని రోజుల్లోనూ ప్రజలకు ఆయా ప్రభుత్వాలు పెన్షన్లు పంపిణీ చేసిన విషయాన్ని అధికారులు, ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్రంలో సైకో జగన్‌ విధ్వంసకర పాలన నుంచి మరో 40 రోజుల్లో ప్రజలకు విముక్తి లభిస్తుందని, ఈ దఫా ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు ముక్కలవ్వడం ఖాయమని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, విరంకి పండు 24 వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ కడియాల విజయలక్ష్మి, జనసేన డివిజన్ ఇంచార్జ్ లోవరాజు టీడీపీ డివిజన్ నాయకులు కావూరి జిన్నా, వేమూరి శ్రీధర్, కానాల శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now