అయితే.. ఇప్పుడు వీరిలో వర్గీకరణ చేసి.. కొందరికి అమలు చేసేందుకు సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో అర్హులైన వారు తక్షణమే ఆన్‌లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని.. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ఎవరు.. అర్హులు.. నిరుద్యోగ భృతిని మూడు వర్గాలుగా వర్గీకరించారు. దీనిలో గ్రాడ్యుయేషన, పీజీ చదివి కూడా.. నిరుద్యోగు లుగా ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులు చేసి ఖాళీగా ఉన్నవారు. అదేవిధంగా మతపరమైన.. విద్యను చదవిన వారు. వీరిలో బ్రాహ్మణులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. దైవ కార్యాలయాలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన విధి విధానాల ను విడుదల చేశారు.
ఈ ప్రకారం.. రాష్ట్రంలో `ఆగమ శాస్త్రం` చదివి, ధ్రువీకరణ పత్రం కలిగినవారు.. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.వీరికి నెలకు రూ.3వేలు అందించనున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆగమశాస్త్రం పూర్తి చేసిన యువ పండితులు మొత్తం 599 మంది ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ జాబితాలో లేకపోతే.. దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు అవకాశం కల్పించింది.
ఇక, తాజాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకుగానూ మొత్తం రూ.53.91 లక్షలను(ఒక్కొక్కరికీ రూ.3000 చొప్పున) భృతి విడుదల చేశారు. కాగా.. గతంలో చంద్రబాబు హయాంలోనూ.. బ్రాహ్మణ కార్పొరేషన్ పేరిట.. పేదల బ్రాహ్మణులకు అనేక రూపాల్లో సాయం అందించారు.