WORLD NEWS: అమెరికా మధ్య-పశ్చిమ ప్రాంతాన్ని ఒక భయంకరమైన తుఫాను అతలాకుతలం చేసింది. BY: BCN TV NEWS ఈ బీభత్సంలో ఇప్పటివరకు కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మధ్య-పశ్చిమ ప్రాంతాన్ని ఒక భయంకరమైన తుఫాను అతలాకుతలం చేసింది. ఈ బీభత్సంలో ఇప్పటివరకు కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో కెంటకీలో సంభవించిన పెనుగాలుల కారణంగా మరణించిన తొమ్మిది మంది కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి లారెల్ కౌంటీలో వచ్చిన టోర్నడో కారణంగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని కెంటకీ అధికారులు తెలిపారు. లారెల్ కౌంటీ షెరీఫ్ జాన్ రూట్ కార్యాలయం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రాణాలతో బయటపడిన వారి కోసం ప్రభావిత ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఇదిలా ఉండగా మిస్సౌరీలో ఏడుగురు మరణించారు. అధికారులు ఇంటింటికి వెళ్లి చిక్కుకున్న లేదా గాయపడిన వారి కోసం వెతుకుతున్నారు. మిస్సౌరీలో కనీసం ఒక టోర్నడోతో సహా అనేక తుఫానులు సంభవించాయి. ఈ తుఫానులు శుక్రవారం వచ్చిన భీకరమైన వాతావరణ వ్యవస్థలో భాగం, దీని కారణంగా విస్కాన్సిన్‌లో టోర్నడో వచ్చింది. గ్రేట్ లేక్స్ ప్రాంతంలో లక్షలాది మంది వినియోగదారులు విద్యుత్ లేకుండా ఉండాల్సి వచ్చింది. టెక్సాస్‌లో తీవ్రమైన వేడి గాలులు వీచాయి.
తుఫాను కారణంగా భవనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సెయింట్ లూయిస్ మేయర్ కారా స్పెన్సర్ మాట్లాడుతూ.. ఈ విపత్తు కారణంగా 5,000 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి నిజంగా వినాశకరమని స్పెన్సర్ అన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోందని, అత్యధిక నష్టం జరిగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించామని ఆమె తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. సెయింట్ లూయిస్ ప్రాంతంలోని మిస్సౌరీలోని క్లేటన్‌లో మధ్యాహ్నం 2:30 నుంచి 2:50 గంటల మధ్య భీకరమైన తుఫాను సంభవించింది.