వైసీపీ నుంచి జారుతున్న మరో ఎంపీ ?


ANDRAPRADESH: ఇదిలా ఉంటే ఈసారి మహానాడు జగన్ సొంత ఇలాకా కడపలో ఏర్పాటు చేస్తున్నారు BY; BCN TV NEWS మరి అక్కడ మహానాడు అంటే ఆ వ్యూహం ఆ లెక్కలూ వేరే లెవెల్ లో ఉండాలి కదా. By:  SRTV NEWS వైసీపీకి కష్టాలు అన్నీ ఒక్క మారు చుట్టుముడుతున్నాయి. అవి చూస్తే సినిమా కష్టాలు కావు, పొలిటికల్ రీల్ కష్టాలు, తాము అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తామని వైసీపీ అధినాయకత్వం అనుకోవచ్చు కానీ చేతిలో నాలుగేళ్ళ పాటు అధికారం ఉన్న టీడీపీ కూటమి ఈ చాన్స్ ఎందుకు వదులుకుంటుంది. తప్పకుండా వైసీపీకి సినిమా చూపించేస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి మహానాడు జగన్ సొంత ఇలాకా కడపలో ఏర్పాటు చేస్తున్నారు మరి అక్కడ మహానాడు అంటే ఆ వ్యూహం ఆ లెక్కలూ వేరే లెవెల్ లో ఉండాలి కదా. పైగా వైసీపీ కూసాలు కదిలిపోవాలి కదా. అది ఎలా జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బిగ్ షాట్స్ ని టీడీపీలోకి తీసుకుని వచ్చినపుడే అంటున్నారు 


ఆ విధంగా భారీ స్కెచ్ గీసి మరీ వైసీపీని దెబ్బ కొట్టే పనిలో టీడీపీ అధినాయకత్వం ఉంది అని అంటున్నారు. దాంతో మహానాడులో ఎవరూ ఊహించని విధంగా పెద్ద నాయకులే సైకిలెక్కుతారు అని అంటున్నారు. ఆ విధంగా చేరే వారిలో రాజ్యసభకు చెందిన ఒక ఎంపీ కూడా ఉంటారని అంటున్నారు. మరి ఆయన ఎవరు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది వైసీపీకి 2024లో అధికారం కోల్పోయేనాటికి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అందులో నలుగురు ఇప్పటికే పార్టీని వీడిపోయారు. ఇక మిగిలిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరజన్ రెడ్డి, మేడా రఘునాధరెడ్డి, ఆళ్ళ అయోధ్యా రామిరెడ్డి, పరిమళ్ నత్వనీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. 

మరి వీరిలో ఎవరు అన్నదే చర్చగా ఉంది. ఇందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ తో ముగుస్తోంది. సో వారు పార్టీ మారినా రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ఆరు నెలల మించి కొత్త వారికి పదవి ఉండదు, సో వారి జోలికి ఎవరూ వెళ్ళరు, వారు కూడా ఈ సమయంలో రారు అని అంటున్నారు. అంటే మరో నలుగురు విషయంలోనే చర్చలు మళ్ళుతున్నాయి. ఆ నలుగురిలో వైవీ సుబ్బారెడ్డి జగన్ సొంత బాబాయ్,ఆయన్ని పక్కన పెడితే నిరంజన్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు, సొంత లాయర్, ఇక ఆయనను కూడా కాదు అనుకుంటే ఇద్దరు పేర్ల మధ్యనే రాజకీయ చర్చ అంతా సాగుతోంది. ఆ ఇద్దరే గొల్ల బాబూరావు, మేడ మల్లికార్జున రెడ్డి. ఇందులో ఒకరు ఉత్తరాంధ్రా వాసి, విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు, రెండవవారు కడప జిల్లాకు చెందిన మేడ రఘునాధరెడ్డి. 

ఈ ఇద్దరి పదవీ కాలం 2030 ఏప్రిల్ 1 వరకూ ఉంది. అంటే కచ్చితంగా అయిదేళ్ళ పాటు పదవి ఉంది అన్న మాట. సో ఈ ఇద్దరి విషయంలోనే రాజకీయంగా అంతా చర్చిస్తున్నారు. గొల్ల బాబూరావు పేరు ఆ మధ్య వినిపించినా తనకు రాజకీయ జన్మ ఇచ్చిన వైఎస్సార్ కుటుంబాన్ని వీడేది లేదని చెప్పారు. మేడా మల్లికార్జున రెడ్డి కూడా గతంలోనే పార్టీని వీడను అని గట్టిగా చెప్పారు కానీ ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. అయితే వైసీపీ నుంచి బయటకు వస్తే తాము రాజీనామా చేసిన ఎంపీ సీటు తిరిగి తమకే ఇవ్వాలని ఒక కండిషన్ మీద మాత్రమే ఎవరు పదవి వదులుకున్నా చెబుతున్నారు అని అంటున్నారు. అంటే తాము పార్టీ మారుతాము కానీ ఎంపీ సీటు మళ్ళీ మాకే ఇవ్వాలని వారు కోరుతున్నారు. 

మరి ఆ షరతుని అటు టీడీపీ కానీ బీజేపీ కానీ అంగీకరిస్తే ఆయా పార్టీల తరఫున వీరు తిరిగి రాజ్యసభకు వెళ్ళే చాన్స్ ఉంది అంటున్నారు ఇప్పటికి అయితే టీడీపీ అధినాయకత్వం నుంచి ఒక హామీ తీసుకునే సదరు ఎంపీ వైసీపీని వీదడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సో మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలా రాజ్యసభ ఎంపీ ఒకరు సైకిలెక్కుతారని దీనిని సంబంధిచిన లాంచనాలు అన్నీ పూర్తి అయ్యాయని అంటున్నారు. సో ఎవరా ఎంపీ ఏమా కధ అంటే మహనాడు వరకూ ఆగాల్సిందే అంటున్నారు.