కంటిచూపుతో యూపీఐ పేమెంట్స్.. మరింత స్మార్ట్ గా, సేఫ్ గా!


ANDHRAPRADESH:భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో భారత్ టాప్ పొజిషన్లో నిలిచింది అంటే మనం ఏ స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేసే దగ్గర నుండి పెద్ద పెద్ద వస్తువుల కొనుగోలు వరకు ప్రతి చోట ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

పిన్ తో యూపీఐ చెల్లింపులు

యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సులభం అవుతుందని దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు కాబట్టి ఇబ్బంది లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో చిల్లర కు సమస్య కూడా ఉండదని అంటున్నారు.అయితే మనం యూపీఐ ద్వారా డబ్బులు పంపించడానికి తప్పనిసరిగా దానికి సంబంధించి ఒక పిన్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

డిజిటల్ చెల్లింపులలో కొత్త విధానం

కొంతమంది కొన్ని సందర్భాలలో పిన్ నెంబర్ మర్చిపోవడం లేదా, తప్పు పిన్ నెంబర్లను ఎంటర్ చేయడం చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈ ఇబ్బందులకు పరిష్కార మార్గాన్ని సూచించే, ఈజీగా యూపీఐ చెల్లింపులు చేసే కొత్త విధానాన్ని తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( NPCI) ప్రయత్నం చేస్తోంది.

పిన్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు

ఇకపై పిన్ నెంబర్ లేకుండానే యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం రాబోతోంది. కేవలం కంటి చూపుతో, ఫేస్ రికగ్నిషన్ యాప్ తో, బయోమెట్రిక్ విధానంలో యూపీఐ చెల్లింపులు చేసేలా మార్పులు తీసుకురాబోతుంది. ఇక ఈ విధానం ద్వారా పిన్ నెంబర్ తెలుసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి చెక్ పెట్టడానికి వీలవుతుంది.

కంటి చూపుతోనే డిజిటల్ చెల్లింపులు

వ్యక్తి యొక్క వేలిముద్ర, లేదంటే ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ ద్వారా మాత్రమే యూపీఐ చెల్లింపులు చేసేలా త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉంది ఎన్పీసీఐ. దీనివల్ల భద్రతతో కూడిన వేగవంతమైన లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్టు సమాచారం.

త్వరలోనే ఈ స్మార్ట్ డిజిటల్ చెల్లింపుల విధానం

ఇక దీనిపైన ఇప్పటివరకు ఎన్పీసీఐ అధికారికంగా ప్రకటించనప్పటికీ, సాధ్యమైనంత త్వరలోనే ఈ విధానాన్ని తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కొత్త విధానాలను అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ ఎవరైనా పాత విధానం ద్వారా పిన్ ఎంటర్ చేసి చెల్లింపులు చేయాలి అనుకుంటే యధావిధిగా అదేవిధంగా చెల్లింపులు చేయొచ్చు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now