ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభానికే ముందే.. అనూహ్యంగా!


ANDHRPRADESH:ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా దీనిపైన అధ్యయనం చేసిన ఏపీ ప్రభుత్వం చివరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖరారు చేసింది.

స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

ఇదిగో అదిగో అని ఊరిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఫైనల్ గా ఈ ఆగస్టు 15వ తేదీన మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ ప్రయాణ పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు సోషల్ మీడియాలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక టికెట్ వైరల్ అవుతుంది.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి స్త్రీశక్తిగా పేరు

ఆ టికెట్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడ డిపో అని రాసి ఉంది. అంతే కాదు ప్రయాణించే రూట్ వంటి అంశాలతో పాటు టికెట్టు ధర, ప్రభుత్వ రాయితీ ఎంత చెల్లించాలి అనేది జీరోగా వేసి జీరో టికెట్ గా ముద్రించారు. ఇక ఈ టికెట్టును చూసిన ప్రతి ఒక్కరు ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి స్త్రీశక్తిగా పేరుపెట్టారు అన్న చర్చ జరుగుతుంది.

ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే ఈ డాక్యుమెంట్ తప్పనిసరి

ఇక మహిళలు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయాలంటే తమకు సంబంధించిన ఏదో ఒక డాక్యుమెంట్ ను చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు వంటి వాటిని చూపించి ప్రయాణం చేయొచ్చు. ఏపీలో అమలు చేయనున్న ఈ కొత్త పథకానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు టైమింగ్ విషయంలో, సిబ్బంది డ్యూటీసమయాలలో కానీ ఎటువంటి మార్పులు ఉండవని తెలుస్తుంది.

ఈ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం

ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో బస్సు ప్రయాణాలు పెరుగుతాయి కాబట్టి, కొత్త బస్సులను కొనుగోలు చేసే వరకు పాత బస్సులలోనే ఈ సౌకర్యాలను కల్పించనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందనున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now