HYDERABAD:తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సర్వం సిద్దం చేసింది. సుదీర్ఘ కాలంగా కొత్త కార్డుల కోసం అనేక మంది వేచి చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వారికి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమం రేపు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇక.. కొత్తగా అర్హత కలిగిన వారి జబితాలకు చెక్ చేసుకునేందు కు పౌర సరఫరాల శాఖ అధికారులు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సీఎం రేవంత్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఎన్నికల సమయంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీ అమలు చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జనవరి 26 నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తరువాత మే 24 నుంచి ఇప్పటి వరకు మరో 3.58లక్షల కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.
దరఖాస్తుల పరిశీలన తరువాత మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత సాధించిన వారికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు తమకు వస్తుందా లేదా అనే సందేహంతో ఉన్న వారు రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది.
https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను ఓపెన్ చేసి ఆ తరువాత FSC Search ఆప్షన్‌పై క్లిక్ చేయండి. Ration Card Search అని వచ్చే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ FSC Application Searchను ఎంచుకోండి. తెరపై MeeSeva Application Search విండో ఓపెన్ అవుతుంది. మీ జిల్లా ఎంచుకుని, మీ సేవా నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ Search క్లిక్ చేస్తే మీ దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది. Approved అని వస్తే మీకు కార్డు మంజూరై.. పంపిణీ చేస్తారు. Pending అంటే ఇంకా పరిశీలనలో ఉన్నట్లుగా భావించాలి

Shakir Babji Shaik
Editor | Amaravathi