ANDHRAPRADESH:గుజరాత్ లో వంతెన కూలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పాయారు. దాదాపు ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో వాటిల్లో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది నీటిలో మునిగిపోయారు. మరికొంత మంది ఈదుకుంటూ బయటపడ్డారు. అయితే ఘటనాస్థలిలో ఓ తల్లి రోదన అందరినీ కలచివేస్తోంది. కళ్ల ముందే బిడ్డ మునిగిపోతుంటే.. 'నా బిడ్డ మునిగిపోతోంది.. కాపాడండి..' అంటూ ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
గుజరాత్ పద్రా నగరం వద్ద మహీ సాగర్ నదిపై గల గంభీర వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఐదు వాహనాలు నీటిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో ఓ తల్లి రోదన అందర్నీ కలచివేస్తోంది.
తన కుటుంబ సభ్యులతో కలిసి బాగ్ దానాకు కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పుట్టెడు దు:ఖం మిగిలింది. ఇద్దరు పిల్లలు, భర్త, అల్లుడితో ఆ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ మహిళ చాకచక్యంగా డోర్ గ్లాసు బద్దలు కొట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. కానీ డోర్ లాక్ కావడంతో ఆమె కుటుంబం మొత్తం నదిలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి.
నా బిడ్డ మునిగిపోతోంది.. కాపాడండి..' అంటూ ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వడోదర- ఆనంద్ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలటంతో ఆ రెండు పట్టణాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అదికారులను అప్రమత్తం చేశారు. నిపుణులను సంఘటనా స్థలానికి పంపి వంతెన కూలిపోవడానికి గల కారణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. 50,000 ప్రకటించారు. అటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు
#WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk
— ANI (@ANI) July 9, 2025

Shakir Babji Shaik
Editor | Amaravathi