వరల్డ్ ఫోటోగ్రఫీ డే: అందమైన, అరుదైన, అపురూప చిత్రాలు


ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన, అందమైన ఛాయాచిత్రాల మాలిక మీ కోసం.


గ్రే హెడ్డ్ కానరీ ఫ్లై క్యాచర్

ఈ పక్షి దాదాపు 12-13 సెం.మీ పొడవు ఉంటుంది.
ఫొటో లొకేషన్: తలకోన అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్

జంగిల్ బుష్ క్వాయిల్

ఈ పక్షి పేరు జంగిల్ బుష్ క్వాయిల్. ఇది పిట్ట కుటుంబానికి చెందిన జాతి. ఇవి కనిపించడం చాలా అరుదు.
ఫొటో లొకేషన్: మామండూరు అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


ఫ్లేమ్ బ్యాక్ వుడ్ పెకర్

ఈ పక్షి పేరు ఫ్లేమ్ బ్యాక్ వుడ్ పెకర్. ఈ పక్షులు వుడ్ పెకర్ కుటుంబానికి చెందినవి.
ఫొటో లొకేషన్: తలకోన అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


సినిరియస్ టైట్

ఈ పక్షి పేరు సినిరియస్ టైట్. ఈ పక్షి టైట్ కుటుంబానికి చెందినది. ఈ పక్షిని గుర్తించడం చాలా అరుదు. ఈ పక్షులు సాధారణంగా జంటలుగా లేదా చిన్న సమూహాలలో కనిపిస్తాయి.
ఫొటో లొకేషన్: తలకోన అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


ఇండియన్ నైట్‌జార్

ఇండియన్ నైట్‌జార్ (కాప్రిముల్గస్ ఆసియాటికస్). ఈ పక్షి బహిరంగ అడవులు, పొదల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా నేలపైన లేదా తక్కువ చెట్లపై కూర్చుంటుంది.
ఫొటో లొకేషన్: మామండూరు అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


ఇండియన్ వైట్-ఐ

ఇండియన్ వైట్-ఐ (జోస్టెరోప్స్ పాల్పెబ్రోసస్). ఇవి చిన్న సమూహాలలో తిరుగుతుంటాయి. తేనె, చిన్న కీటకాలను తింటాయి. కంటి చుట్టూ ప్రత్యేకమైన తెల్లటి వలయంతో పాటు పై భాగం పసుపు రంగులో ఉంటుంది. దీని పొడవు సుమారు 8-9 సెం.మీ.
ఫొటో లొకేషన్: తలకోన అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


ఆరెంజ్-హెడ్ థ్రష్

ఆరెంజ్-హెడ్ థ్రష్ (జియోకిచ్లా సిట్రినా) థ్రష్ కుటుంబానికి చెందిన పక్షి.
ఇది భారత ఉపఖండం, ఆగ్నేయాసియాలో బాగా చెట్లతో కూడిన ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. తరచుగా తడి ప్రాంతాలలో, ప్రవాహాల సమీపంలో లేదా నీడ ఉన్న లోయలలో కనిపిస్తుంది. ఆరెంజ్-హెడ్ థ్రష్ 205–235 మిల్లీమీటర్లు (8.1–9.25 అంగుళాలు) పొడవు, బరువు 47–60 గ్రాములు ఉంటాయి.
ఫొటో లొకేషన్: మామండూరు అటవీ ప్రాంతం, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్


టిక్కెల్ బ్లూ ఫ్లైక్యాచర్

టిక్కెల్ బ్లూ ఫ్లైక్యాచర్ (సియోర్నిస్ టికెల్లియే) అనేది ఫ్లైక్యాచర్ కుటుంబానికి చెందిన ఒక చిన్న పాసెరైన్ పక్షి. ఇవి దట్టమైన పొదల్లో కనిపిస్తాయి. టికెల్ బ్లూ ఫ్లైక్యాచర్ 11–12 సెం.మీ పొడవు ఉంటుంది.


వైట్-రంప్డ్ షామా

వైట్-రంప్డ్ షామా (కాప్సైకస్ మలబారికస్) అనేది మస్కికాపిడే కుటుంబానికి చెందిన ఒక చిన్న పక్షి. వీటి బరువు సాధారణంగా 28- 34 గ్రాముల (1.0 మరియు 1.2 oz) వరకు ఉంటుంది. పొడవు 23–28 సెం.మీ (9–11 in) వరకు ఉంటాయి. ఆడ పక్షులు మగవాటి కంటే పొట్టిగా ఉంటాయి. వీటి స్వరం చాలా మధురంగా ఉంటుంది.


బ్లాక్-హుడ్ ఓరియోల్

బ్లాక్-హుడ్ ఓరియోల్ (ఓరియోలస్ శాంతోర్నస్) పాసేరిన్ పక్షుల ఓరియోల్
కుటుంబానికి చెందినది. ఇది బహిరంగ అడవుల్లో ఉంటుంది. దీని ఆహారం కీటకాలు, పండ్లు.


ఇండియన్ ప్యారడైజ్ ఫ్లైక్యాచర్‌

ఇండియన్ ప్యారడైజ్ ఫ్లైక్యాచర్‌లు 19–22 సెం.మీ (7.5–8.7 అంగుళాలు)
పొడవు ఉంటాయి. వాటి తలలు నల్లని కిరీటం, శిఖరంతో నిగనిగలాడుతూ ఉంటాయి.


బార్ హెడెడ్ గూస్

బార్-హెడెడ్ గూస్ (అన్సర్ ఇండికస్). చిత్తడి ఆవాస పక్షి. ఇది లేత బూడిద రంగులో ఉంటుంది.



ఇండియన్ స్కోప్స్ గుడ్లగూబ

ఇండియన్ స్కోప్స్ గుడ్లగూబ (ఓటస్ బక్కమోనా) అనేది దక్షిణాసియాకు చెందిన గుడ్లగూబ జాతి. భారతీయ స్కాప్స్ గుడ్లగూబ 23–25 సెం.మీ (9.1–9.8 అంగుళాల) చిన్న గుడ్లగూబ అయినప్పటికీ ఇది స్కాప్స్ గుడ్లగూబలలోఅతిపెద్దది.


కాపర్స్మిత్ బార్బెట్

కాపర్స్మిత్ బార్బెట్: ఇది 15–17 సెం.మీల పొడవు, 30–52.6 గ్రాముల బరువు ఉంటుంది.
ఇది భారత ఉపఖండం, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో నివసించే
పక్షి. తన గూడును నిర్మించడానికి చెట్టు లోపల రంధ్రాలు చేస్తుంది.