Dr BR Ambedkar Konaseema: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్ బుధవారం నామనేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయిన సమనస గ్రామ సర్పంచ్ గా కొనసాగుతున్నారు. 29 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2004, నుండి ఇప్పటికి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేశారు.
ప్రతి సారి పార్టీ మీకు న్యాయం చేస్తుంది అంటూ బుజ్జగిస్టు వచ్చింది. 2024 కచ్చితంగా పార్టీ టికెట్ వస్తుందని శ్యామ్ కుమార్ వర్గీయులు ఎదురు చూశారు. 2024లో కూడా మళ్లీ టికెట్ దక్కకపోవడంతో నిరుత్సాహపడ్డారు. చంద్రబాబు పార్టీలో ఉన్న అసంతృప్తులను పార్టీ టికెట్ కేటాయించిన అభ్యర్థులు కలుపుకుని పని చేయాలని ఆదేశించిన 29 సంవత్సరాలు నుండి ఓకే పార్టీలో ఉంటూ సీనియర్ నాయకుడుగా ఉన్న శ్యామ్ కుమార్ కలుపునే విషయంలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు మొగ్గు చూపలేదు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తే పార్టీ అన్యాయం చేసింది అంటూ శ్యామ్ కుమార్ వర్గీయుల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు.
బుధవారం సమనస నుండి భారీ ఎత్తున ర్యాలీతో నామనేషన్ దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో శ్యామ్ కుమార్ కి మద్దతుదారులు తరలివచ్చారు. ఒక్కఅవకాశం ఇవ్వండి అమలాపురం నియోజకవర్గని అభివృద్ధి బాటలో నడిపిస్తా... అవినీతి లేని పాలన చేస్తా అంటూ శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగోలు పెద్దకాపు, యళ్ల జగ్గారావు, నల్లా ఏసుబాబు, బుడ్డిగా శ్రీను, శివగంగ శ్రీను, తోతరమూడి సాయి తదితరులు పాల్గొన్నారు.